జల్సాల కోసం చోరీలు: శబరిమల యాత్రలో విషాదం, ఓ వ్యక్తి మృతి

గుంటూరు: జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.4.50 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తెనాలిలో నివాసం ఉంటున్న సువర్ణరాజు అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడు. గత కొన్ని రోజులుగా అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు అతను గురువారం పోలీసులకు చిక్కాడు.

శబరిమల యాత్రలో విషాదం

శబరిమల యాత్రకు వెళ్తున్న తెలుగు భక్తుల బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గాజరాయినివలసకు చెందిన 27 మంది యాత్రికుల బృందం ఈ నెల 5వ తేదీన శబరిమలకు బయలుదేరింది.

Tenali police arrest a theif

గురువారం తెల్లవారు జామున తమిళనాడులోని కడలూరు జిల్లాలో బస్సు చెడిపోవడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతులు ప్రారంభించారు. ఈ సమయంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందుకు వెళ్లింది.. ఈ సయమంలో బస్సు మందు నిలుచుని ఉన్న నల్ల నాగేశ్వర రావు (42) మీదుగా బస్సు దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

మహిళ దారుణ హత్య

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురయ్యాడు. కడప జిల్లా వేంపల్లెలో చోటు చేసుకుంది. స్థానిక గురుగు వీధిలో నివాసం ఉంటున్న పూలకుంట తులసి (44) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. గురువారం ఉదయం కూతురు ఆమె ఇంటికి వచ్చింది.

ఆమె వచ్చి చూసేసరికి తులసి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమె తులసికి సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారంలో గొడవల కారణంగా హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+