ఎత్తు రగడ: ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత, జగన్ ఎమ్మెల్యే ధర్నా
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని కోస్గి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆర్డీఎస్ వద్ద ఆదివారం ఉద్రిక్తత తలెత్తింది. కర్నాటక సర్కార్ రెండడుగుల ఎత్తు పెంచాలని పనులు చేపట్టడంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతులు ఆర్డీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.
కోస్గి దగ్గర రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీని వల్ల మూడువేల టీఎంసీల నిలువ నీరు రావలసి ఉండగా ఇప్పటి వరకు రాలేదని చెబుతూ.. రైతులు భారీ సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఆనకట్ట ఎత్తు పెంచుతున్నారనే సమాచారంతో కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆందోళనకు దిగారు.

ఆర్డీఎస్ ఎత్తు పెంచే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఆయన ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల అధికారులు చర్చించి ఆనకట్ట ఎత్తు పెంచాలని, అప్పటి వరకు పనులు ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల రైతులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications