డ్రైవర్‌ను కొట్టిన అనుచరులు, బస్సులోనే బైరెడ్డి పడిగాపు

బస్సుయాత్ర జరుగుతున్న సమయంలో రెండు కార్లలో ఆయన అనుచరులు బుచ్చినాయుడికండ్రిగకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గోవర్ధనపురం వద్ద ఆ కార్లను ఓ ఆటో ఓవర్ టేక్ చేసింది. దీంతో బైరెడ్డి అనుచరులు ఆటోను ఆపి డ్రైవర్ వెంకటేష్, మరో వ్యక్తిని చితకబాదారు.
వెంకటేష్ స్థానికుడే కావడంతో ఈ విషయాన్ని అక్కడ చెప్పారు. దీంతో గ్రామస్థులు ఆ కార్లను అడ్డుకోబోయారు. ఓ కారు వెళ్లిపోగా మరో కారులో ఉన్న ముగ్గురిపై వారు ప్రతిదాడి చేశారు.
అంతలోనే సభ ముగించుకొని వస్తున్న బైరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో బైరెడ్డి గంటసేపు బస్సులోనే ఉండిపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications