Gannavaram TDP:గరంగరంగా గన్నవరం-టీడీపీ ఆఫీస్‌పై వంశీ వర్గీయుల దాడి..!

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతోపాటు కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వంశీ వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిపై స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వంశీపై విమర్శలు గుప్పించారు. దీంతో తమ నాయకుణ్నే విమర్శిస్తారా? అంటూ వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.

Tension in Gannavaram: MLA Vallabhaneni followers target TDP office

మధ్యాహ్నం పార్టీ కార్యదర్శి దొంతు చిన్నా ఇంటిపై దాడికి ప్రయత్నించగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. సాయంత్రం సమయంలో పార్టీ కార్యాలయంపై దాడిచేశారు. ఈరోజు ఉదయమే టీడీపీ కార్యాలయం చుట్టూ కారులో వంశీ చక్కర్లు కొట్టారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయ అద్దాలు పగలగొట్టారు. మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు రాగా వాటిని రానివ్వకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. గన్నవరం అంతా ఉద్రిక్తంగా మారింది. టీడీపీ వర్గాలు, వైసీపీ వర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+