కృష్ణాజిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు-టీడీపీ కీలక నేతల అరెస్టులు ? పలుచోట్ల పోలీసు నిర్బంధాలు..!
కృష్ణాజిల్లాలో గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని నిన్న వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసి తగులబెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. పోలీసులు నిందితుల్ని వదిలి నిరసనలకు రెడీ అయిన టీడీపీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు.
గన్నవరంలో నిన్న టీడీపీ ఆఫీసు ధ్వంసం, దహనం చేసిన ఘటనలో నిందితుల్ని అరెస్టు చేయాల్సిన పోలీసులు టీడీపీ నేతల అరెస్టులకు దిగారు. మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేల్ని హౌస్ అరెస్ట్ చేయటడంతో పాటు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని గుర్తుతెలియని ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై టీడీపీ డీజీపీని ఆశ్రయించింది.
గన్నవరం టీడీపీ ఆఫీసు ధ్వంసం
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిన్న రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, నేతలు దాడిచేసి కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వసం చేశారు. అంతటితో ఆగని వైసీపీ కార్యకర్తలు అక్కడున్న టీడీపీ నేతల వాహనాలపై పెట్రోలు పోసి నిప్పంటించారు.
కత్తులతో వీరంగం సృష్టించి ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ ముఖ్యనేతలు గన్నవరంకు బయల్దేరి వెళ్లారు.
టీడీపీ నేతలపై పోలీసుల ప్రతాపం
గన్నవరంలో టీడీపీ ఆఫీసును వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నా కిమ్మనని పోలీసులు.. ఆ ఘటన తెలుసుకుని గన్నవరానికి బయలుదేరిన టీడీపీ నేతల్ని మాత్రం అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. ముందుగా పార్టీ నేత పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తరలించారో కూడా తెలియలేదు.
అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమను, బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను అరెస్టు చేశారు. తర్వాత నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బోండా ఉమా, బుద్దా వెంకన్న వంటి నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ని నాగాయలంక పీఎస్ కి తరలించారు. దీంతో నాగాయలంకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అరెస్టులపై టీడీపీ ఆగ్రహం
టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ కార్యకర్తలు దాడిచేయడం, కార్లు తగలపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వాళ్లను అరెస్ట్ చేయాల్సింది పోయి.. తమను అరెస్ట్ లు, హౌస్ అరెస్టులు, తరలింపులు చేయడం ఏంటని పోలీసులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేత పట్టాభి కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆయన సతీమణి చందన తన భర్త ఫోన్ స్విచాఫ్ వస్తోందని, ఆయనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ డీజీపీదే బాధ్యతని చెప్తున్నారు.
గన్నవరం ఘటనలపై ఇప్పటికే డీజీపీకి టీడీపీ లేఖ రాసింది. హౌస్ అరెస్టులు, అరెస్టులు, టీడీపీ నేతలు కనిపించకుండా పోవడంపై పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications