విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఆపరేషన్ వచ్చిన వజ్ర ప్రహార్ లో భాగంగా పోలీసులు, ఈగల్ టీం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.'ఆపరేషన్ వజ్ర ప్రహార్' ప్రధానంగా రాష్ట్రంలో గంజాయి సరఫరాను అరికట్టడమే లక్ష్యం గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో ఒక వ్యక్తి పోలీసులపైకి కాల్పులకు ప్రయత్నించడం ఒకసారి అందరినీ షాక్ కు గురి చేసింది.
విజయవాడలో వ్యక్తిపై తుపాకీతో కాల్పులు
విజయవాడలో కార్దన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి ఒక వ్యక్తి తుపాకీతో కాల్పులను జరపడానికి ప్రయత్నం చేయగా, తుపాకీ మొరాయించటంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు అయింది. విజయవాడలోని బస్టాండ్ సమీపంలో బాలాజీ హోటల్ దగ్గర పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తి
అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతను తన వద్ద ఉన్నదంతా పోలీసుల వైపు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. గన్ లాక్ కావడంతో బుల్లెట్లు బయటకు రాలేదు. దీంతో పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు. ఒకసారి ఒక షాకింగ్ సంఘటన నుంచి అప్రమత్తమైన పోలీసులు పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకున్నారు.
వరంగల్ జిల్లా వాసిగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల పైన గన్ తో కాల్పులు జరపడానికి ప్రయత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతని వరంగల్ జిల్లా నెల్లికుదురు కి చెందిన వ్యక్తి అని, అతని పేరు మురళి అని గుర్తించారు. అతని వద్ద నుండి 9mm పిస్టల్, ఐదు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మురళిని పోలీసులు టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అసలు ఈ మురళి ఎవరు? విజయవాడకు ఎందుకు వచ్చాడు? అతని వద్ద తుపాకీ ఎందుకు ఉంది? ఎవరిని చంపేందుకు ప్లాన్ చేసుకుని వచ్చాడు? పోలీసులపైన ఎందుకు కాల్పులకు ప్రయత్నం చేశాడు? వంటి అనేక కారణాల పైన ప్రస్తుతం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications