చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ-అపాయింట్మెంట్లపైనే అందరి దృష్టీ-లెక్కలు మారతాయా ?

ఏపీలో తాజాగా పట్టాభి ఎపిసోడ్ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా తమ ఆఫీసుల్ని వైసీపీ టార్గెట్ చేసిన క్రమంలో కేంద్రం సాయం కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపు ఢిల్లీ టూర్ కు బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ తీసుకున్న చంద్రబాబు.. కేంద్రంలో పెద్దల్ని సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు కేంద్రంలో పెద్దలు అపాయింట్ మెంట్ ఇస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఆ అపాయింట్మెంట్లు దొరికితే మాత్రం వైసీపీకి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తోంది.

పట్టాభి ఎపిసోడ్ మంటలు

పట్టాభి ఎపిసోడ్ మంటలు

ఏపీలో టీడీపీ నేత పట్టాభి రేపిన మంటలు అన్నీ ఇన్నీ కావు. వ్యూహాత్మకంగా చేశారా, యథాలాపంగా చేశారో తెలియదు కానీ సీఎం జగన్, డీజీపీ సవాంగ్ పై ఆయన చేసిన బోసడికే వ్యాఖ్యల ప్రకంపనలు మాత్రం ఇప్పుడు ఢిల్లీని తాకేలా ఉన్నాయి. పట్టాభి వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడి చేశారు.

ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగగానే... వైసీపీ నేతలు కూడా జనాగ్రహ దీక్షకు దిగారు. ఈ దీక్షల్లో నేతలు పరస్పరం మాటల తూటాలు, బూతులతో రెచ్చిపోయారు. పరస్పరం వార్నింగ్ లు కూడా ఇచ్చుకున్నారు. చివరికి దీక్షలు ముగిసినా చంద్రబాబు ఢిల్లీ టూర్ మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.

రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్

రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్


పట్టాభి వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు రెచ్పిపోయిన తీరును కేంద్రానికి తెలిసేలా చేయడం కోసం కేంద్రంలోని పెద్దల్ని కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసి వైసీపీ సర్కార్ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఆఫీసులపై నేరుగా ప్రత్యర్ధి పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడంతో ఈ వ్యవహారాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అధికార ఎన్డీయేతో పాటు విపక్ష నేతల్ని కూడా కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన అపాయింట్ మెంట్లు కోరుతున్నారు.

చంద్రబాబుకు అపాయింట్మెంట్లపై ఉత్కంఠ

చంద్రబాబుకు అపాయింట్మెంట్లపై ఉత్కంఠ

చంద్రబాబు ఢిల్లీ టూర్ లో భాగంగా ఎవరెవరిని కలవబోతున్నారనే అంశాన్ని టీడీపీ గోప్యంగా ఉంచుతోంది. ఇప్పటివరకూ నిర్ధారణ అయిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ పైనే టీడీపీ వివరాలు వెల్లడించింది. మిగతా అపాయింట్ మెంట్లు ఇంకా ఫిక్స్ అయ్యాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ముందుగా అపాయింట్ మెంట్లు ఫిక్స్ అయినట్లు ప్రకటించుకుంటే ఇబ్బందులు తప్పవని, ప్రత్యర్ధి వైసీపీ మధ్యలో దూరే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ఢిల్లీ వెళ్లాకే వివరాలు వెల్లడించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబుకు దక్కిన అపాయింట్ మెంట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

మోడీ, అమిత్ షా కరుణిస్తారా ?

మోడీ, అమిత్ షా కరుణిస్తారా ?

మూడేళ్ల క్రితం ఎన్డీయే నుంచి తప్పుకుని బీజేపీ నేతలపై ధర్మపోరాటం ప్రకటించి అభాసుపాలైన చంద్రబాబు.. ఇప్పుడు తిరిగి బీజేపీతో జత కట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ రెండేళ్లుగా బీజేపీ మాత్రం టీడీపీని అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండేళ్లలో ఒక్కమాట కూడా మాట్లాడని చంద్రబాబు.. కేంద్రంతో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

అయితే బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ ఇద్దరూ తమకు ఒకటేనని చెబుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు ఇస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ఎన్డీయే నుంచి విడిపోయాక చంద్రబాబు మాటెత్తని మోడీ, అమిత్ షా ఇప్పుడు ఆయనకు అపాయింట్ మెంట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.

అపాయింట్ మెంటే టర్నింగ్ పాయింట్

అపాయింట్ మెంటే టర్నింగ్ పాయింట్

చంద్రబాబుకు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్ మెంట్ ఇస్తే మాత్రం టీడీపీ లెక్కలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెండేళ్లుగా చంద్రబాబును దూరంగా ఉంచిన బీజేపీ.. ఆయనపై అమరావతి భూముల కేసులో వైసీపీ కోరినట్లుగా సీబీఐ దర్యాప్తు వేసేందుకు మాత్రం ఒప్పుకోలేదు. అలాగే లోకేష్ పైనా కేంద్ర దర్యాప్తులకు అంగీకరించలేదు.

దీంతో ఓవైపు వైసీపీతో స్నేహం కొనసాగిస్తూనే అవసరాలకు తగినట్లుగా టీడీపీని వాడుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. గతంలో వ్యవసాయ బిల్లులతో పాటు పలు అంశాల్లో టీడీపీ ఎంపీలు ఎన్టీయేకు సహకరించారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ల విషయంలో బీజేపీ కనికరించే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే రాష్ట్రంలో టీడీపీకి కొత్త ఊపిరి రావడం ఖాయం.

అప్పుడు వైసీపీ కూడా ఇరుకునపడటం ఖాయం. అందుకే వైసీపీ కూడా చంద్రబాబు అపాయింట్ మెంట్లపై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇందులో ఏమాత్రం చంద్రబాబు విఫలమైనా ఆయన్ను బదనాం చేసేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+