పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల ధ్వంసం: అభిమానుల ఆందోళన, ఉద్రిక్తత

ఏలూరు: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. అనుమానితుల ఇళ్లపై దాడులు కూడా చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానుల ఆందోళనతో భీమవరం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు అభిమానులు క్షీరాభిషేకం చేశారు. ఆందోళన కొనసాసగుతోంది. వివరాలు అందాల్సి ఉంది.

tension prevailed at Bheemavaram on Pawan kalyan flexis

పవన్ కళ్యాణ్ అభిమానులు భీమవరం పట్టణంలో బీభత్సం సృష్టించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ అభిమానులే వాటిని చించేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగడమే కాకుండా ప్రభాస్ ఫ్లెక్సీలను చించేసి వాటిని రోడ్డు మీద పడేసి నిప్పంటించారు.

రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం కనిపించలేదు. రాత్రి సమయంలో రాస్తా రోకో చేశారు. రోడ్డుపై నిప్పు పెట్టి హంగామా చేశారు. అనుమానితుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+