ఆంధ్రప్రదేశ్ కు షాక్, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కుమ్మేశారు. దెబ్బకు మైండ్ బ్లాక్ !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తి కావడంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల ఆశలు గల్లంతు అవుతాయని ఇప్పటికే తెలిసిపోవడంతో ఆ నాయకుల్లో ఇప్పటికే ఆందోళన మొదలైయ్యిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముఖ్యంగా అందరి తలరాతలు రాయడానికి ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యి వారి నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాలకు చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఓటు వెయ్యడానికి వారి సొంత జిల్లాలకు చేరుకుని ఓటు కూడా వేశారు.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, నగిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎగరేసుకుంటూ వచ్చిన ఓటర్లు ఎవరికి ఓటు వేశారు ?, ఆ ఓట్లు మాకు అనుకూలంగా పడ్డాయా ? లేదా ? అని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల గుండెల్లో ఇప్పటికే దడ మొదలైయ్యింది.

అయితే ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఓట్లు వెయ్యడం తాము ఎప్పుడూ చూడలేదని కర్ణాటక, తమిళనాడు సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. మొత్తం మీద పొరుగు రాష్ట్రాల్లో నివాపం ఉంటున్న ప్రజలు వారి సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సొంత ప్రాంతాలకు వచ్చి ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వెయ్యడంతో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అని ఎవ్వరూ అంచనా వెయ్యలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications