శ్రీశైలం అందరిదీ, హైదరాబాద్ కాదా: టిజి వెంకటేష్

రాష్ట్ర విభజన జరగాలంటే ఆర్టికల్ 371డిని తొలగించాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీని సమావేశపరచాలా, వద్దా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభను రద్దు చేయాలని తాను ముఖ్యమంత్రిని ఎప్పుడో కోరినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన జరిగితే కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆయన అభిప్రాయపడ్డారు.
స్పీకర్‌ను లాగుతారా..
శాసనసభ స్పీకర్‌ను విభజన ఉచ్చులోకి లాగడం సరైంది కాదని తెలంగాణకు చెందిన ప్రభుత్వ విప్ అనిల్ అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశాలు లేవని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. స్పీకర్‌పై ఎవరైనా అవిశ్వాసం ప్రతిపాదించినా తాము మద్దతు ఇవ్వబోమని ఆయన అన్నారు. శాసనసభ ప్రోరోగ్ అయినా, కాకపోయినా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సిఎంపై తీవ్రమైన వ్యాఖ్యలు
తెలుగుదేశం పా్రటీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడివి అవకాశవాద రాజకీయాలని ప్రభుత్వ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని పుస్తకాలు పంపినా రాష్ట్ర విభజన ఆగదని స్పష్టం చేశారు. ఈ నెలలోనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని సీఎంకూ తెలుసని, అధిష్టానం నిర్ణయానికి సీఎం కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications