రాజధాని రగడ: కర్నూలే కావాలని టిజి వెంకటేష్ పట్టు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)కు కర్నూలును రాజధానిని చేసేంత వరకు పోరాడతామని మాజీ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. 1956కి ముందు ఉన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలన్నారు. సమైక్యాంధ్ర జెఏసిలు రాయల ఆంధ్ర రాజధాని సాధన సమితిగా ఏర్పడ్డాయని, దానికి తన మద్దతు ఉంటుందన్నారు.
కర్నూలును రాజధానిని చేయాల్సిందేనని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉంటాయన్నారు. 25వేల ఎకరాల భూమి కూడా ఉందన్నారు. 1956 నాటి రాజధానిని తిరిగి ఇవ్వాలన్నారు. చిచ్చు పెట్టేలా రాజధాని కమిటీ ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కర్నూలును రాజధానిగా చేసే ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతివ్వాలన్నారు.

తెరాసపై అనిల్ కుమార్
తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చడం పెద్ద పని కాదని ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో 55 మంది తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇచ్చారన్నారు. వారిలో ఎవరు గెలిచినా పార్టీని వీడే ప్రమాదముందని తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భయపడుతున్నారన్నారు. గతంలోనూ ఆ పార్టీలో అదే జరిగిందన్నారు. తెరాసకు 45 సీట్లు వచ్చే అవకాశముందని చెప్పారు. ఈ వాస్తవాన్ని గ్రహించిన కెసిఆర్ రాహుల్‌కు మద్దతిస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications