'లోకేష్‌కు ఏపీ బాధ్యతలు ఇచ్చి, చంద్రబాబు రాష్ట్రపతి పదవి చేపట్టాలి'

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: రాష్ట్రంలో అధికారాన్ని ఐటీ మంత్రి నారా లోకేష్‌కు అప్పగించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి పదవిని చేపట్టాలని టిడిపి ఎంపీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పేర్కొన్నారు.

ఆదివారం ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి పదవికి చంద్రబాబు అన్ని విధాలా అర్హులు అని చెప్పారు. అలాగే ఒకటి రెండు పార్టీలు మినహా మిగతా పార్టీలు చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తాయని చెప్పారు.

 TG Venkatesh wants Chandrababu president of India

విశాఖలో బిజెపి సమావేశం వాయిదా

విశాఖపట్నంలో నిర్వహించిన తలపెట్టిన బిజెపి జాతీయ కార్యనిర్వాహక సమావేశం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాన్ని జులై 15, 16 తేదీల్లో నిర్వహించ తలపెట్టగా, ఆ తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఏర్పాట్లతో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి.

కొత్త తేదీలను, వేదికను బిజెపి అధ్యక్షులు అమిత్ షా నిర్ణయిస్తారని తెలిపాయి. ఈసారి జాతీయ కార్యనిర్వాహక సమావేశం ఏపీలోగానీ, తెలంగాణలోగానీ నిర్వహించాలని ఏప్రిల్‌లో భువనేశ్వర్‌లో జరిగిన బిజెపి సమావేశంలో పార్టీ నేతలు నిర్ణయించారు.

'లక్ష్మీపార్వతిలా జగన్ ఓవరాక్షన్ చేస్తే అంతే', బాబుకు నారాయణ హితబోధ

ఆ తర్వాత ఏపీ బిజెపి నేతల విన్నపంతో విశాఖపట్నంలో నిర్వహించేందుకు అధినాయకత్వం ఆమోదం తెలిపింది. ప్రజల మనోభావాల్ని పార్టీకి అనుకూలంగా మలిచేందుకు ప్రధాని మోడీతో భువనేశ్వర్‌ తరహాలోనే విశాఖలోనూ 22 కి.మీ. మేర రోడ్డు షో నిర్వహించాలనీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Minister and Telugudesam Party MP TG Venkatesh on Sunday said that many parties will support if AP CM Chandrababu Naidu presidential candidate.
Please Wait while comments are loading...