వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రోడ్లేసింది టీడీపీనే ; నాసిరకం పనులు చేసి మళ్ళీ నిందలా ? రోడ్ల దుస్థితిపై వైసీపీ రివర్స్ అటాక్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రోడ్లపై నిరసనను తెలియజేస్తూ రహదారులను మరమ్మతులు చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని, ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్ల పరిస్థితి దైన్యంగా మారి వాహనచోదకులకు చుక్కలు చూపిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆందోళన కార్యక్రమాలను చేసింది.

ఏపీలో అడ్రస్ లేని బీజేపీ.. తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ ల చవితి రాజకీయం : కొడాలి నానీ ధ్వజంఏపీలో అడ్రస్ లేని బీజేపీ.. తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్ ల చవితి రాజకీయం : కొడాలి నానీ ధ్వజం

రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆందోళనలు .. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ నిరసనలు

రోడ్ల దుస్థితిపై టీడీపీ ఆందోళనలు .. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ నిరసనలు


ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి గుంతల మయంగా మారిన రహదారుల దుస్థితిని ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలిసేలా వినూత్న కార్యక్రమాలు చేసింది . జగనన్న గుంతల పథకం అంటూ టీడీపీ నేతలు రాష్ట్ర రహదారులపై ఉన్న గుంతలలో వలలు వేసి చేపలు పడుతూ వినూత్న నిరసనలు తెలియజేశారు. మరి కొందరు టిడిపి నేతలు శ్రమదానం చేసి గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల వరి నాట్లేసి, ఆ గుంతలలోకి దిగి నిలబడి టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు. మొదట టీడీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం కొనసాగింపుగా జనసేన కూడా రోడ్ల దుస్థితిపై జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా సమరశంఖం పూరించింది.

టీడీపీ హయాంలోనే వేసిన రోడ్ల దుస్థితి ఇది .. వైసీపీ రివర్స్ అటాక్

టీడీపీ హయాంలోనే వేసిన రోడ్ల దుస్థితి ఇది .. వైసీపీ రివర్స్ అటాక్

దీంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన రోడ్లను మరమ్మతు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్షా కాలం ముగిసిన వెంటనే మరమ్మతులపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితికి గతంలో పాలన చేసిన చంద్రబాబు సర్కారు నిర్వాకమే కారణమని, గత ప్రభుత్వ హయాంలోనే నాసిరకం రోడ్లు వేశారని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత సర్కారు చివరి రెండేళ్లపాటు రహదారుల నిర్వహణ మరమ్మతులను గాలికి వదిలేసిందని విమర్శలు గుప్పించారు.

నాసిరకం పనులు చేసింది టీడీపీ హయాంలోనే

నాసిరకం పనులు చేసింది టీడీపీ హయాంలోనే

అధికారంలో ఉన్న సమయంలో రోడ్ల దుస్థితి గురించి పట్టించుకోకుండా, నాసిరకం పనులతో మమ అనిపించి ప్రస్తుతం ఆ పార్టీ నేతలు మాటల దాడి చేస్తున్నారంటూ పార్టీ పైన నిప్పులు చెరిగారు. గతంలో అధికార పార్టీపై బురద చల్లడానికి ఏ అవకాశం దొరుకుతుందా అని టిడిపి నేతలు ఎదురుచూస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక కొందరు టిడిపి నేతలు ఆర్టిఐ సమాచారం అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్ల నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ పెద్దగా చేసిందేమీ లేదని ఆయన లెక్కలు చెప్పారు.

టీడీపీ హయాంలో పెద్దగా రోడ్లేసింది, రిపేర్లు చేసింది లేదు .. లెక్కలివే

టీడీపీ హయాంలో పెద్దగా రోడ్లేసింది, రిపేర్లు చేసింది లేదు .. లెక్కలివే

టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో కొత్తగా 1356 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం జరిగిందని రహదారుల విస్తరణ మరమ్మతు పనులు 8,917 కిలోమీటర్లమేర జరిగిందని చెబుతున్నారన్న విషయాన్ని వెల్లడించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1883 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని, రెండేళ్లలో 4015 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులు, మరమ్మతు పనులు జరిగాయని వెల్లడించారు.

 మంత్రి పెద్దిరెడ్డిపై మాట్లాడే స్థాయి టీడీపీ నేతలకు లేదు

మంత్రి పెద్దిరెడ్డిపై మాట్లాడే స్థాయి టీడీపీ నేతలకు లేదు

అంతేకాదు 7828 కోట్ల రూపాయలతో 9550 ఏడు కిలోమీటర్ల రహదారులకు సంబంధించిన పనులు మంజూరు చేసి నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని, వర్షాకాలంలో హడావుడిగా పనులు సాగిస్తే రోడ్డు దెబ్బతింటాయని కారణంతో వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభించాలని నిర్ణయించామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మాట్లాడే స్థాయి టీడీపీ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. వర్షాల వల్ల రోడ్లకు దెబ్బ, మరమ్మత్తులకు కరోనా అడ్డంకి

చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. వర్షాల వల్ల రోడ్లకు దెబ్బ, మరమ్మత్తులకు కరోనా అడ్డంకి

చంద్రబాబు హయాంలో తీవ్ర దుర్భిక్షంతో రాష్ట్రం అల్లాడిపోయిందని పేర్కొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అని, జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్న ఆయన, కరోనా కారణంగా మరమ్మతుల విషయంలో కాస్త నిదానంగా పనులు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు రోడ్ల విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తూ తాము వేసిన రోడ్ల గురించి తామే ప్రచారం చేసుకుంటున్నారు అంటూ ఎదురు దాడి చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

Recommended Video

Who Is Stuart Binny ? | బిన్నీ రికార్డ్ బ్రేక్ చెయ్యడం బుమ్రా వల్ల కూడా కాదు || Oneindia Telugu
టీడీపీ చేసిన పనులను ప్రజలంతా చూస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్న వైసీపీ

టీడీపీ చేసిన పనులను ప్రజలంతా చూస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్న వైసీపీ

ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాదు వైసీపీ నేతలు అందరూ చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై రివర్స్ దాడి చేస్తున్నారు. టీడీపీ హయాంలో నిర్మాణమైన రోడ్లపై టీడీపీ నేతలే ప్రచారం చేసుకుంటున్నారని, నాసిరకం పనులు చేసింది టీడీపీనే అన్న విషయం జనాలు గుర్తిస్తున్నారని చెప్తున్నారు. కావాలని ప్రతి విషయానికి అభూత కల్పనలు సృష్టించటం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పులు చేసిన టీడీపీ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వైసీపీ సర్కార్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. చంద్రబాబుకు అసత్య ప్రచారాలు చెయ్యటం అలవాటని మండిపడుతున్నారు .

English summary
YCP leaders counterattacked on Telugudesam party. YCP leaders are blaming the previous Chandrababu government for the poor condition of roads in the state. YCP MLA Vasantha Krishna Prasad has been criticized the previous government for leaving road repairs for the last two years. Ignoring the dilapidated condition of the roads during babu tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X