అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని అమరావతిపై ఎమ్మెల్యే శ్రీదేవి షాకింగ్ కామెంట్స్, నిరసన సెగ, మందడంలో వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ !!

|
Google Oneindia TeluguNews

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అమరావతి ఉద్యమం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతిలో జరిగేది రైతుల ఉద్యమం కాదని అది కేవలం ఫొటో ఉద్యమం అని ఆమె మండిపడ్డారు.మందడం నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతం సీఎం జగన్ తోనే అభివృద్ధి చెందుతుందని ఉండవల్లి శ్రీదేవి తేల్చిచెప్పారు.

జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!జగన్ వర్సెస్ కేసీఆర్ ... ఇద్దరూ సమ ఉజ్జీలే.. తాజా జలజగడం వెనుక ఆధిపత్య పోరు !!

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ

ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మందడం వెళ్తున్న క్రమంలో రాజధాని ప్రాంత అమరావతి జేఏసీ అడ్డుకొని తమ నిరసన తెలియజేశారు. గుంటూరు జిల్లా మందడంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి వెళుతున్న శ్రీదేవిని లింగాయపాలెం సమీపంలో అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు ఇవ్వడం లేదంటూ, పింఛన్ చెల్లించడం లేదంటూ శ్రీదేవి కి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు.

 మందడంలో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉండవల్లి శ్రీదేవి

మందడంలో గ్రామ సచివాలయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉండవల్లి శ్రీదేవి

ఎమ్మెల్యే వాహనానికి అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని పక్కకు నెట్టి ఎమ్మెల్యే వాహనానికి మార్గాన్ని సూచించారు. ఉండవల్లి శ్రీదేవిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దళిత రైతు పులి చిన్న ను అదుపులోకి తీసుకొని ఎమ్మెల్యే వెళ్ళాక వదిలిపెట్టారు.

ఇక మందడంలో గ్రామ సచివాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన ఉండవల్లి శ్రీదేవి తన వాహనాన్ని అడ్డుకోవడంపై అక్కడ జరిగిన కార్యక్రమంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లపై వినతి పత్రాలా ? ఫైర్ అయిన ఎమ్మెల్యే

రోడ్లపై వినతి పత్రాలా ? ఫైర్ అయిన ఎమ్మెల్యే

రైతులు ఎవరూ తమ సమస్యలపై తనను కలవలేదని, రైతులు వచ్చి కలిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీదేవి వెల్లడించారు. రోడ్లపై వినతి పత్రాలు ఇస్తే ఎలా అని, సమస్యలు ఉంటే తన దగ్గరకు వచ్చి మాట్లాడాలని సూచించారు. అంతేకాదు త్వరలోనే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని శ్రీదేవి పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తమ అభ్యర్థనను వినిపించుకోలేదని, వినతి పత్రం ఇస్తున్న పట్టించుకోకుండా వెళ్లిపోయారని, ఇక పోలీసులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమని అరెస్టు చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి మాత్రం రాజధాని అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

English summary
Tadikonda MLA Undavalli Sridevi made sensational remarks on the Amravati movement. She was incensed that what was happening in the capital, Amravati, was not a farmers' movement, it was just a photo movement. Earlier, she was stopped by protesters. Amravati JAC intercepted her vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X