AP News: కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో క్రమబద్ధీకరణ..!
ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటన చేసింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పింది. దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావశంలో ఉద్యోగ సంఘాలు పలు అంశాలు లేవనెత్తాయి.
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పీఆర్సీ, డీఏ బకాయిలు రెండింటినీ కలిపి ఒకటిగా చేసి చెల్లించాలని ఉద్యోగ సంఘాలు కోరాయని బొత్స వివరించారు. వారి డిమాండ్లక ప్రభుత్వం ఒకే చెప్పినట్లు పేర్కొన్నారు. మూడు నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సరానికి నాలుగు విడతలు, నాలుగేళ్లలో 16 విడతల్లో ఈ బకాయిలు చెల్లిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏటా పది శాతం చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాల్లో మొత్తం బకాయిలను చెల్లిస్తామన్నారు.

వైఎస్సార్ సీపీ ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని మంత్రుల ఉపసంఘం పేర్కొంది. ఆర్థిక పరిస్థితుల వల్ల వారికి ఇవ్వాల్సిన వాటి విషయంలో కొంత ఆలస్యం జరిగిందే కానీ, ఉద్యోగుల పట్ల సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని వివరించారు. ఇన్ని ఓపికగా ఉన్న ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. మంత్రుల ఉపసంఘంతో జరిగిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదురి, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎదుట ఉంచిన 71 డిమాండ్లలో దాదాపు అన్నీ పరిష్కారమయ్యాయని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నాపని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.మురళీరెడ్డి హర్షం ఆనందం వ్యక్తం చేశారు. ఇటు క్రాంటాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications