సినీ ఫక్కీలో పెళ్లి ఘట్టం నుంచి వధువు పరారి: అర్థాంతరంగా ఆగిన పెళ్లితో ఘర్షణ

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు: వారిద్దరికి పెళ్లి చూపులు...అబ్బాయికి అమ్మాయి నచ్చింది...అమ్మాయి కూడా ఓకే అంది....ఇంకేముంది ఇద్దరు తల్లిదండ్రులు ఫలానా తేదీన పెళ్లి అని ఫిక్సయిపోయారు. అనుకున్న తేదీ రానే వచ్చింది...పెళ్లి ఏర్పాట్లతో పాటు విందు ఏర్పాట్లు కూడా జరిగాయి. చర్చిలో పెళ్లి ప్రక్రియ ప్రారంభమైంది...ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది.....అయితే ఆ పెళ్లి ఘట్టం పూర్తి కాలేదు...సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఓ పరిణామం....ఫలితం రెండు వర్గాల మధ్య ఘర్షణ....గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామానికి చెందిన యువకుడికి, గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల ప్రాంతానికి చెందిన యువతికి ముందు పెళ్లి చూపులు జరిగాయి. ఒకరికి ఒకరు ఏ అభ్యంతరం చెప్పకపోవడంతో పెద్దలు వీరికి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి తేదీ నిర్ణయించారు.

 ఘనంగా పెళ్లి ఏర్పాట్లు...

ఘనంగా పెళ్లి ఏర్పాట్లు...

అనుకున్న ప్రకారం బుధవారం పెళ్లి జరగాల్సి ఉండటం, వీరి సంప్రదాయం ప్రకారం పెళ్లి వరుడి ఇంటి వద్ద జరగాల్సి ఉండటంతో అందకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు, విందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి కి హాజరయ్యేందుకు పెళ్లి కూతురును తీసుకొని ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద సంఖ్యలో వరుడి నివాసానికి చేరుకున్నారు. పెళ్లి చర్చిలో జరగనుండటంతో పెళ్లికి హాజరైన ఇరువర్గాల బంధువులతో చర్చి ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

 పెళ్లి ఘట్టం ప్రారంభం...

పెళ్లి ఘట్టం ప్రారంభం...

వధూవరులు ఇద్దరు పెళ్లి దుస్తులు ధరించి పెళ్ల వేదికైన చర్చి వద్దకు విచ్చేశారు. అంతా సిద్దంగా ఉండటంతో పాస్టర్ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టాన్ని ప్రారంభించారు. ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ పెళ్లి తంతు ముందుకు సాగుతోంది. అప్పటివరకు ఎలాంటి అవాంతరం లేకుండా సజావుగా ముందుకు కొనసాగుతున్న పెళ్లి ప్రక్రియ అతి ముఖ్యమైన ఘట్టానికి చేరుకుంది.

ఇంతలోనే వరుడికి షాక్...

ఇంతలోనే వరుడికి షాక్...

ఈ ఘట్టంలో ఆచారాన్ని అనుసరించి పాస్టర్ వధూవరులను ఈ పెళ్లి మీకిష్టమేనా అని అడుగుతారు. ఆ విధంగా పాస్టర్ వరుడిని ఈ పెళ్లి నీకిష్టమేనా అని అడిగాడు. పెళ్లికొడుకు నాకిష్టమేనని చెప్పాడు. ఆ తరువాత పాస్టర్ వధువును అదే ప్రశ్న అడుగగా ఆమె చెప్పిన సమాధానంతో పాస్టర్ విస్తుపోగా పెళ్లికొడుకు షాక్ తిన్నాడు. ఈ పెళ్లి నీకిష్టమేనా అని అడిగిన పాస్టర్ తో వధువు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని సమాధానం చెప్పింది. దీంతో పెళ్లి ప్రాంగణంలో కలకలం రేగింది.

 సినీ ఫక్కీలో వధువు పరారీ...

సినీ ఫక్కీలో వధువు పరారీ...

వధువు మాటలతో రేగిన కలకలం సద్దుమణగక ముందే మరో అనూహ్య ఘటన అక్కడ చోటుచేసుకుంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన పెళ్లి కూతురు హడావుడిగా వేదిక మీద నుంచి కిందకు దిగి బైటకు పరిగెత్తింది. అప్పటికే అక్కడ సినీ ఫక్కీలో ఒక యువకుడు బైక్ తో సిద్దంగా ఉండగా పరుగెత్తుకొంటూ వచ్చి అతడి బండెక్కి ఉడాయించింది. అంతా క్షణాల మీద జరిగిన ఈ ఘటనతో పెళ్లికొడుకు నిశ్చేష్టుడవగా ఇరువర్గాల బంధువులు దిగ్బ్రాంతి చెందారు. ఆ తరువాత పెళ్లి ప్రాంగణంలో గొడవ మొదలైంది.

 ఇరువర్గాల మధ్య ఘర్షణ...

ఇరువర్గాల మధ్య ఘర్షణ...

ఇలా వధువు పారిపోవడంతో వరుడి బంధువులు పెళ్లికూతురి తరుపువారితో గొడవకు దిగారు. మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం మీకు ముందే తెలిసినా మాకు చెప్పకుండా దాచారని, ఈ విధంగా మా పరువు తీసారంటూ వాదనకు దిగారు. దీంతో వివాదం ఘర్షణకు దారితీసింది. అయితే ఇందులో పెళ్లికుమార్తె తల్లిదండ్రుల తప్పేం లేదని సర్ధి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే వధువు తీరుపై పెళ్లికొడుకు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఉంటే ముందే చెప్పాలి గానీ ఈ విధంగా ముందు అంగీకారం తెలిపి తరువాత ఇలా పెళ్లి మధ్యలో వెళ్లిపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur:This news reveals around a bride, who has dramatic escape from church compound. This incident happens in Guntur dist.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి