తిరుమల ఆలయానికి తాళం: కంపార్టుమెంట్లల్లో భక్తులు- ఏర్పాట్లు
Lunar eclipse 2025: నేడు చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది- పౌర్ణమి రోజున రాహుగ్రస్త కాలంలో శతభిష నక్షత్రంలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఆ రోజు నుంచే పితృపక్షం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.
రాత్రి 9:57 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘ గ్రహణ కాలం ఇది. 11 గంటల సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 11:42 నిమిషాలకు చంద్రుడు పరిపూర్ణంగా గ్రహణ ఛాయలోకి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి దాటిన తరువాత 12:22 నిమిషాలకు గ్రహణం విడుస్తుంది. వేకువ జామున 1:26 నిమిషాలకు గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.

తిరుమల శ్రీవారి ఆలయం..
ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను మూసివేశారు. శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరంత సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ లల్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కలిగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పీఏసీ- 2, వైకుంఠం వంటశాలలు మూసి వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కోసం 50,000 పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసింది. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుండి పునః ప్రారంభమౌతుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం..
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాల నుండి మూసివేశారు. సోమవారం తెల్లవారు జాము 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం చేస్తారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం..
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల వరకు శుద్ధి, పూలంగి సేవ, శాత్తుమొర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహించారు. 3:30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 4.30 నుండి పలు సేవల అనంతరం ఉదయం 9.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
శ్రీనివాస మంగాపురం ఆలయం..
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3.00 గంటల వరకు కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 4.45 నిమిషాలకు తెరుస్తారు. తదుపరి ఏకాంత సేవల తర్వాత ఉదయం 8.30 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కపిలతీర్థం..
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మద్యాహ్నం 1.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయశుద్ధి, సుప్రభాతం, అభిషేకం, అర్చన సేవల తదుపరి ఉదయం 7 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
-
శ్రీవారి దర్శనం , వసతి కోసం వేచి చూస్తున్న భక్తులకు TTD గుడ్ న్యూస్, ఇలా సులభంగా..!! -
అలిపిరితో పాటు తిరుమలలో -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ రైలు ప్రారంభం-టైమింగ్స్, హాల్ట్ లివే..! -
తిరుమల ప్లాన్ చేసుకుంటున్న వారికి రైల్వే బిగ్ అప్డేట్, కొత్తగా అందుబాటులలోకి..!! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్












Click it and Unblock the Notifications