బయటకు వెళ్తే మాడిపోవాల్సిందే - దంచికొడుతున్న ఎండలు : ఆరెంజ్ ఎలర్ట్ జారీ..!!
ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో బయటకు వెళ్తే మాడిపోవాల్సిందే. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. 122 ఏళ్ల తరువాత.. తొలిసారి ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ రోజు రేపు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ముఖ్యంగా అదిలాబాద్.. కొమరం భీమం - ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఐఎండీ హెచ్చరించింది.
Recommended Video

1901 ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ఎండలు దంచికొట్టాయని, ఆ తరువాత.. ఇప్పుడు 2022 ఏప్రిల్‌లో నమోదవుతున్నాయని వివరించింది. నార్త్‌వెస్ట్ ప్రాంతంలో ఏప్రిల్‌లో సగటున 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1901, ఏప్రిల్‌తో పోలిస్తే.. 3.35 డిగ్రీలు అధికం. 2010 ఏప్రిల్‌లో 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మధ్య భారతదేశంలో చూసుకుంటే.. సగటున 2022 ఏప్రిల్‌లో 37.78 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతంలో 1973, ఏప్రిల్‌లో సగటున నమోదైన 37.75 డిగ్రీల కంటే అధికం. కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది రాత్రి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 27 నుంచి వడగాలులు వీస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో సగటున 35.05 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నార్త్‌వెస్ట్ ప్రాంతంలో సగటున రాత్రి ఉష్ణోగ్రత 19.44 డిగ్రీలు ఉంటే.. 1901 తరువాత.. మరో 1.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత కూడా ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఇది రాత్రి సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంది. నార్త్‌వెస్ట్‌తో పాటు మధ్య భారతదేశంలోనిపలు ప్రాంతాల్‌లో ఏప్రిల్, మేలో నిరంతరంగా తక్కువ వర్షపాతం నమోదైంది.
మార్చిలో వాయువ్య భారతదేశంలో దాదాపు 89 శాతం వర్షపాతం లోటు నమోదు కాగా.. ఏప్రిల్‌లో 83 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ పరిస్థితుల కంటే.. 1.12 డిగ్రీలు అధికం. 122 ఏళ్ల తరువాత.. నాల్గో అత్యధిక సగటు ఉష్ణోగ్రతగా అధికారులు వివరించారు. 2010లో అత్యధికంగా 35.42 డిగ్రీలు నమోదైంది. మేలో వేడి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. ఢిల్లి, పంజాబ్, హర్యానా, చండీగడ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌లో మేలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సాధారణం కంటే అత్యధికంగా రికార్డు అవుతాయని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ గత నాలుగు రోజులు వేడి తీవ్రత పెరిగింది. రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో...ఈ సమయంలో బయటకు వెళ్లకపోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మధ్నాహ్నం 1 గంటల నుంచి 4 గంటలకు తీవ్రత ఎక్కువగా ఉంటోంది.












Click it and Unblock the Notifications