Annamaiah District: కూతురి కోసం కువైట్ నుంచి వచ్చి మరీ హత్య.. ఆ తర్వాత సెల్ఫీ వీడియో..!
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మంగంపేటలో దారుణం జరిగింది. తన కూతురిని వేధిస్తున్నాడని ఓ తండ్రి హత్య చేశాడు. కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి తిరిగి వెళ్లిపోయాడు. వెళ్లిన తర్వాత సెల్పీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామకృష్ణ, రజిని(కల్పిత పేర్లు) దంపతులకు కుమార్తె ఉంది. వారు ఉపాధి కోసం కువైట్ వెళ్లాల్సి వచ్చింది. దీంతో రజిని తన కూతుర్ని చెల్లి కళావతి(కల్పిత పేరు) వద్ద ఉంచింది. బాలికి పిన్న వద్ద ఉంటూ చదువుకుంటుంది. అయితే కళావతి మామ బాలికను లైంగికంగా వేధించసాగాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లి రజినికి చెప్పింది. దీంతో రజిని మంగపేటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు సరిగా స్పందించ లేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త రామకకృష్ణ కువైట్ నుంచి మంగపేటకు వచ్చాడు. నిద్రిస్తున్న అంజనేయులుపై రాడ్ దాడి చేసి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి కువైట్ వెళ్లిపోయాడు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే రామకృష్ణ కువైట్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తన కూతురి పట్ల తాతా వరుసయ్యే అంజనేయలు అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పాడు. పోలీసులు చెప్పిన పట్టించుకోలేదని.. అందుకు మంగపేటకు వచ్చి అంజనేయులను చంపి చంపి తిరిగి కువైట్ వచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ సెల్ఫీ వీడియోతో పోలీసులు కంగు తిన్నారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని వీడియోలో రామకృష్ణ చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు.
ఈ వ్యవహారంలో పోలీసులు సరిగా స్పందించినట్లయితే ఈ ఘోరం జరిగేది కాదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అటు బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ విషయంలో కూడా పోలీసులు సరిగా స్పందించి ఉంటే.. అతని ప్రాణం కూడా దక్కేదని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications