Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుపతిలో కార్తీక బ్రహ్మోత్సవాలు: తేదీలు ఇవే

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. 17న ధ్వజారోహణం చేస్తారు. అనంతరం అమ్మవారిని చినశేషవాహనంపై ఊరేగిస్తారు. 18 పెద్దశేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి, సింహవాహనం, 20న కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, 21న పల్లకీ ఉత్సవం, గజవాహనం, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణ రథోత్సవం, గరుడవాహన సేవలను నిర్వహిస్తారు. 23 సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహనం, 25న పంచమీతీర్థం ధ్వజావరోహణ కార్యక్రమాలు ఉంటాయి.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. అమ్మ‌వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముంద‌స్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.

The Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru at Tiruchanoor from November 17 to 25

పద్మ సరోవరం, నాలుగు మాడ వీధులు, తోళప్ప గార్డెన్స్, ఫ్రైడే గార్డెన్స్, ఎగ్జిబిషన్ ప్రాంతం, ఉద్యానవన ప్రదర్శన శాల, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి హోల్డింగ్ పాయింట్, నవజీవన్ ప్రాంతాలను వీరబ్రహ్మం పరిశీలించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు.

అమ్మవారికి నిర్వహించబోయే వాహనసేవల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సకాలంలో రూపొందించాలని అన్నారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శన భారీ సంఖ్యలో భక్తులు వస్తారని, దీనికి అనుగుణంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను సిద్ధం చేయాలని వీరబ్రహ్మం చెప్పారు. భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని జేఈఓ చెప్పారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తుల రద్దీకి అనుగుణంగా డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది, అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

టీటీడీ నిఘా, భద్రత అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని మోహరింపజేయాలని చెప్పారు. పంచమితీర్థం రోజున అమ్మవారిని దర్శించడానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందని, వారి వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలని జేఈఓ సూచించారు. నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూల్, పూడి వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు 82,136 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 29,023 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 27 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+