చంద్రబాబు ఆర్డర్, లెక్కమాత్రం తేలడంలేదు, ఆ లీడర్ ఎక్కడ ఉన్నాడో ?

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు కీలక సమాచారం సేకరిస్తున్నారు అని తెలిసింది. ఇప్పటికే పలువురు రెవెన్యూ శాఖ ఉద్యోగులను విచారణ చేసిన అధికారులు విచారణ చేసిన పోలీసు అధికారులు వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారని తెలిసింది. మదనపల్లెలో గతంలో పనిచేసిన ఆర్టీవో మురళి, హరి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను వేరువేరుగా విచారించిన పోలీసు అధికారులు వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 18 నెలలు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో మురళి ఆర్డీవో గా పనిచేశారు. ఆ సమయంలో వైసీపీ నాయకులు చెప్పింది చెప్పినట్లుగా మురళి పని చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనే అక్రమాలకు పాల్పడిన మురళి పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒంగోలులో పని చేసే సమయంలో సదావర్తి మఠం భూముల విషయంలో ఆర్డీవో మురళి అక్రమాలకు పాల్పడిన ఆయనపై ఆరోపణలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.

The Madanapalle Sub Collector s office has accelerated the investigation of the case

ఆ సమయంలో ఆర్టీవో మురళిని తహసిల్దార్ గా రివర్షన్ చేశారు. ఇప్పటికే మదనపల్లె ఆర్టీవో ఉన్న మురళి అక్కడ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి రెవెన్యూ శాఖా మంత్రి ద్వారా స్పెషల్ సస్పెన్షన్, రివర్షన్ లపై స్టే తెచ్చుకున్న ఆర్డీవో మురళి తిరుపతి కలెక్టరేట్ లో లీగల్ అథారిటీ సెల్ లో స్పెషల్ కలెక్టర్ గా విధుల్లో చేరారు. మదనపల్లె నుండి బదిలీపై వెళ్లిపోయిన తిరుపతిలో ఉద్యోగం చేస్తున్న మురళి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన రెండు రోజులు ముందు మదనపల్లెకు వచ్చి అక్కడే ఉండటం వివాదాలకు కారణం అయ్యింది.

The Madanapalle Sub Collector s office has accelerated the investigation of the case

గతంలో ఆర్డీవో మురళిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఆయన మదనపల్లెలోనే ఉండటం కలకలం రేపింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసులో ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పాత్రపై ప్రత్యేక టీమ్ పోలీసు అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

The Madanapalle Sub Collector s office has accelerated the investigation of the case

అయితే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడు మాధవ రెడ్డి చిక్కితే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని ఓ పోలీసు అధికారి అంటున్నారు. వైసీపీ నాయకుడు మాధవ రెడ్డి ఆచూకీ మాత్రం ఇంతవరకు చిక్కలేదని పోలీసులు అంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి దాదాపు నెలరోజులు కావస్తోంది. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు కీలక సమాచారం సేకరించారని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఫైల్స్ రికవరీ చేస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+