వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి సైతం ఆ పోస్టు ముందు దిగదుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా కాంటాక్ట్ లోకి వచ్చేసే పవర్ ఫుల్ పదవిగా చెప్పే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి ఎవరికన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ కీలక పదవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి కట్టబెడతారన్న దానిపై స్పష్టత వచ్చింది. గజన్ కు అత్యంత సన్నిహితులు.. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఎంపికి చేయనున్నారు.
పార్టీ కోసం సుబ్బారెడ్డి చేసిన త్యాగాలకు ప్రతిగా ఈ కీలక పదవికి ఆయన్ను ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఇదే విషయంపై జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి విధేయుడిగా ఉండటమే కాదు.. పార్టీ కోసం త్యాగాలకు ఏ మాత్రం వెనుకాడని వ్యక్తిత్వం సుబ్బారెడ్డి సొంతంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేసి.. రాజీనామా చేయటం ఒక ఎత్తు అయితే.. పార్టీ అంతర్గత సర్దుబాటులో భాగంగా ఒంగోలు ఎంపీ సీటు నుంచి బరిలో దిగకుండా ఉండటాన్ని మర్చిపోలేం. జగన్ మాటతో 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండిపోయిన సుబ్బారెడ్డి.. పార్టీకి.. జగన్ కు ఎంతో విధేయులు. తాను పోటీలో లేకున్నా.. ఒంగోలు ఎంపీ అభ్యర్థి విజయం కోసం విపరీతంగా శ్రమించిన గొప్పతనం సుబ్బారెడ్డిది.
అలాంటి ఆయన కు కీలక పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లుగా తెలిసింది. జగన్ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు సుబ్బారెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్న సుబ్బారెడ్డి.. పార్టీ సంక్షోభం సమయాల్లో జగన్ కు అండగా నిలిచారు. నమ్ముకున్న వారికి పెద్ద పీట వేసే వైఎస్ ఫ్యామిలీకి తగ్గట్లే .. తాజాగా జగన్ నిర్ణయం అదే రీతిలో ఉన్నట్లుగా చెప్పక తప్పదు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications