హ్యాట్రిక్ కోసం జగన్ ప్లాన్, రిటన్ గిఫ్ట్ కోసం ఓటర్లు వెయిటింగ్, లీడర్స్ కు టెన్షన్, రివర్స్ గేమ్ !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓ నియోజక వర్గంలో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్న వైఎస్ జగన్ కు రివైంజ్ గిఫ్ట్ ఇస్తామని స్థానిక ఓటర్లు అంటున్నారు.
భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదనపల్లె నియోజక వర్గంలో గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. తరువాత చిత్తూరు జిల్లా నుంచి మదనల్లెను విడదీసి ఆ ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేయడంతో పాటు జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం మదనపల్లెకు తీరని అన్యాయం చేసిందని ఆ ప్రాంతంలోని ప్రజలు రగిలిపోతున్నారు.

మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. జగన్ సీఎం అయిన తరువాత కొత్త జిల్లాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదపల్లెలో బ్రిటీష్ కాలం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ కార్యాలయాలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యాశాఖల కార్యాలయాలు ఉన్నాయి.

ఇక శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ తరువాత రాయలసీమలో అంత పెద్ద కాలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న బీటీ కాలేజ్ కూడా మదనపల్లెలోనే ఉంది. అలాంటి చరిత్ర ఉన్న మదనపల్లెను అన్నమ్య జిల్లా కేంద్రంగా చెయ్యాలని అప్పట్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు. అయితే సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీలో మంచి పలుకుబడి ఉన్న ఆ పార్టీ విప్, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పట్టుబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని చేశారు.
సీఎం జగన్ మదనల్లెకు తీరని ద్రోహం చేశారని మదనపల్లె ప్రజలు రగిలిపోతున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి పేరు ప్రకటించడంతో మదనపల్లెలో వ్యాపారలావాదేవీలు దెబ్బతిన్నాయి. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వచ్చిన నష్టం ఏమిటి అని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజలు ఇంకా రగిలిపోయారు. పార్టీ హైకమాండ్ ఒత్తిడితో ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను పక్కన పెట్టిన వైసీపీ ఇప్పుడు మరో మైనార్టీ నాయకుడు నిషార్ అహమ్మద్ కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది.

మదనపల్లెను జిల్లా కేంద్రంగా పెట్టాలని ఆ రోజు ఆందోళన చేసిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సొంత అన్న, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో మదనపల్లెకు ఆ రోజు అన్యాయం జరిగినా పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు మదనపల్లెలో హ్యాట్రిక్ కోసం పావులు కదుపుతున్నారు.
బలిజ, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే మదనపల్లె నియోజక వర్గం ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని మదనపల్లె నియోజక వర్గంలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం మీద మదనపల్లెలో వైఎస్ జగన్ హ్యాట్రిక్ మంత్రం పని చేస్తుందా ?, లేక జిల్లా కేంద్రంగా అన్యాయం చేసిన ఆ పార్టీకి మదనపల్లె ప్రజలు రివైంజ్ గిఫ్ట్ ఇస్తారా ? అని వేచి చూడాలని మదనపల్లె నియోజక వర్గం ప్రజలు అంటున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications