కుమార్తెపై అత్యాచారం ,హత్య వేదన తో .. అమరావతిలో హత్యకు గురైన జ్యోతి తండ్రి మృతి
కూతురుపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తో షాక్ కు గురైన జ్యోతి తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. కుమార్తె మరణవార్త విన్న వెంటనే గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అంగడి గోవింద్ తుది శ్వాస విడిచారు. కన్నబిడ్డను కాపాడుకోలేకపోయానని ఆవేదనకు గురైన గోవింద్ గుండెపోటుకు గురయ్యారు.జ్యోతి మరణం నుండి ఆసుపత్రిలోనే ఉన్న ఆయన మనోవేదనతో మరణించారు.
దీంతో పెళ్లి చేసుకోమని ప్రియుణ్ని నిలదీసి, అతడి చేతిలో హత్యకు గురైన జ్యోతి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. కుమార్తె హత్య విషయం తెలిసిన తర్వాత ఆయన తీవ్రంగా కలత చెందారు. జ్యోతి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన జరిగిన రోజే గోవింద్‌కు గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు.

గుంటూరు జిల్లాలో జ్యోతి అనే మహిళ అత్యాచారం, హత్యకు గురవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అమరావతి టౌన్‌షిప్ సమీపంలో ఈ నెల 11వ తేదీ రాత్రి జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె ప్రియుడు శ్రీనివాసే ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.పెళ్లి చేసుకోమని జ్యోతి శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకురావడం వల్లే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయితే ఈ ఘటనతో ఇప్పటికే విషాదంలో మునిగిపోయిన మృతురాలి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మృతివార్త తెలిసి తీవ్ర ఆవేదనకు గురైన ఆమె తండ్రి అంగడి గోవింద్ గుండె పోటుకు గురయ్యారు. అప్పటినుండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు మంగళవారం తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబం మరింత దు:ఖానికి గురయ్యింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications