వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ కంటే సీట్లు తక్కువే అన్న లగడపాటి ...డిజిట్ సింగిలా? డబులా?

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో కీలకంగా మారుతుందని అందరూ భావిస్తే లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో అంత సీన్ లేదని తేల్చి పారేశారు. ఇంతకీ ఎన్ని స్థానాలు వస్తాయో, అవి ఎక్కడ ఎక్కడ వచ్చే అవకాశం వుందో కూడా చెప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగపూడిలోని అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారని ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తోందన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు జనసేన పార్టీనే కాదు ఏ పార్టీకి సంబంధించిన సంఖ్య ప్రకటించలేదు. ప్రజా రాజ్యం కంటే తక్కువ వస్తాయని చెప్పారు కానీ ఆ సంఖ్య ఎంత అనేది ఇప్పుడు చర్చకు కారణం అవుతుంది.

చిరంజీవి ప్రజా రాజ్యం కంటే పవన్ కళ్యాణ్ జనసేనకు తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన లగడపాటి

చిరంజీవి ప్రజా రాజ్యం కంటే పవన్ కళ్యాణ్ జనసేనకు తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పిన లగడపాటి

పవన్ కళ్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నాడని ఏదో కొత్త విషయం చెప్పినట్టు చెప్పారు లగడపాటి రాజగోపాల్ . మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని రాజకీయాల్లోకి కూడా పవర్ స్టార్ అవుతారన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడు అని రెండో తమ్ముడు అంటూ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం కంటే పవన్ కళ్యాణ్ జనసేనకు తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. ఇంతకీ ఆ సంఖ్య ఎంత అంటే అది కూడా చెప్పలేదు.

జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో లెక్క చెప్పకుండా దాటవేసిన లగడపాటి

జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో లెక్క చెప్పకుండా దాటవేసిన లగడపాటి

అయితే జనసేన పార్టీ రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తుందా లేక సింగిల్ డిజిట్ మాత్రమే జనసేన ఖాతాలో పడుతుందా అనేది లెక్క తేలాల్సి వుంది. ఇకపోతే మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ చిన్నవాడు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ కంటే జనసేనకు తక్కువ సీట్లు వస్తాయా అన్న దానిపై సమాధానం దాటవేశారు లగడపాటి రాజగోపాల్. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కరే గెలుస్తారా లేక రెండంకెల స్థానాల్లో విజయం సాధిస్తారా అన్నది ప్రశ్నించినప్పటికీ లగడపాటి లెక్క చెప్పలేదు.

లగడపాటి సర్వే ఫలితాలపై జనసేన అసహనం .. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన కీలకం అవుతుందని ధీమా

లగడపాటి సర్వే ఫలితాలపై జనసేన అసహనం .. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన కీలకం అవుతుందని ధీమా

లగడపాటి చెప్పిన విధానం సేమ్ టూ సేమ్ తెలంగాణా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే ఉందని , అంతా గందరగోళం ఆయన సర్వేలో ప్రతిబింబించింది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు జనసైన్యం సైతం తెలంగాణా ఫలితాలు తుస్సుమనిపించిన లగడపాటి ఆంధ్రా ఫలితాలను కరెక్ట్ గా అంచనా వేస్తారనుకోవటం తప్పులో కాలెయ్యటమే అంటున్నారు. జనసేన ఏపీ ఎన్నికల్లో కీలకంగా మారుతుందని ఎన్నికల ఫలితాల తర్వాత అసలు సినిమా జనసేన చూపిస్తుందని జనసైన్యం మాత్రం చాలా ధీమాతో ఉన్నారు.

English summary
Pawan Kalyan said that he is going to enter the assembly is something new, said Lagadapati Rajagopal. On the other hand, Pawan Kalyan is a power star and he is also a power star in politics. Lagadapati said Pawan Kalyan would have less seats for Janasena than Chiranjeevi's praja rajyam party . That number is not even mentioned. However, it is not cleared in Lagadapati survey whether the Jana sena Party will win in double-digit seats or the single digit .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X