అరవైలో ఇరవై, చంద్రబాబు ఆరోగ్యరహస్యమిదే, మెనూ ఇదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 68 ఏళ్ళకు చేరుకొన్నారు.62 ఏళ్ళ వయస్సులో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు.

ఈ వయస్సులో కూడ ఆయన ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ఆహరపు అలవాట్లే కారణంగా చెబుతారు.

చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1995 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకొన్నారు. ఆనాటి నుండి ఆయన తన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయలేదు.

ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా నిత్యం బిజీగా సమావేశాల నిర్వహణకు ఆయన ఆహారపు అలవాట్లే కారణమని వైద్యులు చెబుతుంటారు.అయితే రుచి కోసం ఆయన ఆహారం తినరు. జీవించడం కోసం మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తారు.

బాబు ఆరోగ్య రహస్యమిదే

బాబు ఆరోగ్య రహస్యమిదే

చంద్రబాబునాయుడు 68 ఏళ్ళకు చేరుకొన్నారు.గురువారం నాడు ఆయన 67 ఏళ్ళ నుండి 68 ఏళ్ళకు చేరుకొన్నారు.అయితే ఈ వయస్సులో కూడ ఆయన కుర్రాడిగా పనిచేయడానికి గాను ఆయన ఆహారపు అలవాట్లే కారణంగా చెబుతారు.

ఇదే ఆహారపు అలవాట్లను ఆయన కొనసాగిస్తున్నారు.అయితే వస్తున్నా మీకోసం పాదయాత్ర విజయవంతం కావడానికి, ఆయన కుర్రాడి తరహాలో పార్టీ కార్యక్రమాల్లో ఇంకా చురుకుగా పాల్గొనడానికి ఆయన ఆహారపు అలవాట్లనే కారణంగా చెబుతారు వైద్యులు

బాబు మెనూ ఇదే

బాబు మెనూ ఇదే


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ఆహరపు అలవాట్లను కొనసాగిస్తారు. ఉదయం పూట రాగి, జొన్న, సజ్జలతో కలిపిన జావను తాగుతారు. దీనితో పాటు ఓ ఆమ్లెట్ తింటారు.అయితే ఆమ్లెట్ వేసే విషయంలో కూడ జాగ్రత్తలు తీసుకొంటారు.


కోడిగుడ్డులో పచ్చసొనను తీసేసి తెల్లసోనతో చేసిన ఆమ్లెట్ ను మాత్రమే ఆయన తింటారు.దీనికితోడు సీజనల్ ఫ్రూట్ ఉంటుంది. మధ్యాహ్నం పూట రాగి, జొన్న, రాగులతో బోజనం చేస్తారు.అయితే ఓ కూర తప్పనిసరి, అయితే కప్పు మాత్రమే తింటారు. కప్పు భోజనం , కర్రీ కూడ కప్పు.రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకొంటారు.అయితే రాత్రి 12 గంటల తర్వాత కూడ పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తే ఒ గ్లాస్ పాలు తాగుతారు.

నాన్ వెజ్ బంద్

నాన్ వెజ్ బంద్

చంద్రబాబునాయుడు నాన్ వెజ్ తినడం మానివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తన మెనూలో మార్పులు చేసుకొన్నారు.ఆనాటి నుండి ఆయన నాన్ వెజ్ ను మానివేశారు.

అప్పటి నుండి ఆయన ఇదే పద్దతిని పాటిస్తున్నారు. చికెన్, మటన్ జోలికి వెళ్ళరు. అయితే ఇటీవల కాలంలో ఆయన కళ్ళజోడును వాడుతున్నారు. అయితే ఈ కారణంగా ఆయనను చేపలను తినాలని డాక్టర్ సలహా ఇచ్చారు. ఈ మేరకు కొద్దిగా చేపలు తినడం ఇటీవల ప్రారంభించారు.

ప్రత్యేక వంటమనుషులు

ప్రత్యేక వంటమనుషులు

చంద్రబాబునాయుడుకు వంట చేసేందుకు ఇద్దరు ప్రత్యేక వంట మనుషులు ఉన్నారు. ప్రతి రోజూ ఏం వండాలి, ఏం పెట్టాలనే విషయాలపై బాబు ఇంటి వద్ద నుండి సమాచారం వస్తోంది.ఈ సమాచారం ఆధారంగా బాబుకు మెనూను తయారుచేస్తారు.ఒక్క గ్రామ్ ఆయిల్ తో పాటు ఇతర సరుకులు ఎక్కువైనా , తక్కువైనా వంట చేసే వారికి క్లాస్ తప్పదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో ఆయనతో పాటే కుక్ లు వెళ్తారు.

వ్యాయామం తప్పనిసరి

వ్యాయామం తప్పనిసరి

ప్రతి రోజూ బాబు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. వ్యాయామం చేయకుండా ఆయన దినచర్య ప్రారంభం కానేకాదు. వ్యాయామం పూర్తైన తర్వాత దినపత్రికలు చదువుతారు.ఆ తర్వాత ఫ్రెష్ అయి అల్పాహరం చేస్తారు.అయితే ఆయన టూర్లకు వెళ్ళిన సమయంలో ఆయన ఉపయోగించే బస్సులో వ్యాయామం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra pradesh chief minister Chandrababu naidu health secret is food habits, Every day without fail he eat one egg. he take liqqidized pulses and egg whites for breakfast. in between , he take a fruit.
Please Wait while comments are loading...