తెల్ల‌వాడి తుపాకీ తూటాల‌కు ఎదురునిలిచిన‌.. ప‌ల్నాడు ముద్దు బిడ్డ మ‌న‌ క‌న్నెగంటి!

వీరుల బ‌లిదానం.. అమ‌ర‌వీరుల త్యాగ‌ఫ‌లం.. స్వాతంత్య్రం.. అవును, కుల.. మ‌త.. ప్రాంత తార‌త‌మ్యం లేకుండా తెల్లదొర‌ల పాల‌న‌ను త‌డిమికొట్టేందుకు చేసిన ఉద్య‌మాల‌లో ఎంద‌రో యోధులు త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశారు. అలాంటి అమ‌ర వీరుడ బ‌లిదాన ఫ‌లిత‌మే మ‌నం అనుభ‌విస్తున్న ఈ స్వేచ్ఛ‌. ఆగ‌స్టు 15 స‌మీపిస్తున్న వేళ‌.. ప్రపంచాన్ని జ‌యించిన బ్రిటీష్ దొర‌ల‌నే వెలివేసి.. ముప్పుతిప్ప‌లుపెట్టి.. చివ‌ర‌కు వారి తూటాల‌కు ఎదురునిలిచి ప్రాణాలొదిలిన ప‌ల్నాడు ముద్దు బిడ్డ క‌న్నెగంటి హ‌నుమంతును ఒక్క‌సారి స్మ‌రిద్దాం!

క‌న్నెగంటి హ‌నుమంతు గుంటూరు జిల్లా పల్నాడులోని మించాల‌పాటు ప్రాంతానికి చెందిన‌వారు. 1870లో కన్నెగంటి అచ్చమ్మ, వెంకటప్పయ్య దంపతులకు జన్మించారు. స్వ‌త‌హాగా వారిది మోతుబరి కుటుంబం కావ‌డంతో గ్రామాధికారుల ఆగడాలను ద‌గ్గ‌ర‌గా చూశారు. చుట్టూ ఉన్న‌వారి జీవ‌న స్థితిగ‌తుల‌ను మార్చేందుకు బాల్యం నుంచే తాప‌త్ర‌య ప‌డేవారు. త‌న‌వంతుగా సాయం అందించేందుకు ప్ర‌య‌త్నించేవారు.

The unsung hero in freedom fight Kanneganti who stood firmly and took british bullets

అయితే, 1920వ సంవ‌త్స‌రం ప్రాంతంలో గాంధీ పిలుపుతో దేశ‌వ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం విస్త‌రిస్తోన్న స‌మ‌యం అది. ఆ ఉద్యమం కాస్త ప‌ల్నాడు ప్రాంతానికి పాకింది. అప్ప‌టికే, పల్నాడుగా చెప్పే గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట ప్రాంతాలు కరవుకాటకాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కాస్తో కూస్తో.. పంట‌ దిగుబడులు వచ్చినా రాకున్నా బ్రిటిష్ ప్ర‌భుత్వానికి శిస్తులతోపాటు పశువుల పోషణకు అడవులపై ఆధారపడేందుకు ఏడాదికి రూ.2 పుల్లరి చెల్లించాన్న నిబంధ‌న ఉండేది. కొత్త అట‌వీ చట్టాల పేరుతో ప‌ల్నాడు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఇబ్బందుల‌కు గురిచేశారు. అలాంటి స‌మ‌యంలో గాంధీ స‌హాయ‌నిరాక‌ర‌ణోద్య‌మ పిలుపు ప‌ల్నాడులో ఉద్ధృతమైంది.

ప్ర‌లోభాల‌కు త‌లొగ్గ‌క‌..

మ‌రీ ముఖ్యంగా హ‌నుమంతు సార‌థ్యంలో మించిల‌పాడు కేంద్రంగా పూర్తి అహింసా మార్గంలో అక్క‌డివారు చేసిన‌ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చుకు దారితీసింది. వారందిరినీ చైత‌న్య‌ప‌రిచి ముందుకు నడిపించిన హనుమంతును చూసి చుట్టపక్క‌ల ప్రాంతాల వారు మ‌రింత ప్ర‌భావితం అయ్యారు. దీంతో బ్రిటిష్ ప్ర‌భుత్వం ర‌గిలిపోయింది. మద్రాసు నుంచి ప్రత్యేక కలెక్టర్‌గా 1922లో రూథర్‌ఫర్డ్‌ను నియ‌మంచారు. రూథ‌ర్‌ఫ‌ర్డ్ ఆదేశాల‌తో బ్రిటిష్‌ సైనికులు గుర్రాలపై ఒక్కో గ్రామంలో విధ్వంసం సృష్టించారు.

అయినా ఎక్క‌డ ప్ర‌జ‌లు పోరాటాన్ని ఆప‌లేదు. దీంతో హ‌నుమంతును లొంగదీసుకునేందుకు అక్క‌డి జ‌మీందారులు, అధికారులు ఎంత ప్ర‌య‌త్నించినా లాభం లేకుండా పోయింది. చివ‌ర‌కు దుర్గి ప్రాంతంలోని 45 గ్రామాల‌ను ఎస్టేట్‌గా మార్చి, దానికి హ‌నుమంతును జ‌మీందారుగా చేస్తామ‌ని, నామ మాత్ర‌పు ప‌న్ను చెల్లిస్తే స‌రిపోతుంద‌ని ప్ర‌లోభ పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. త‌న స్వార్థం కోసం ప్ర‌జ‌ల‌ను బ‌లి చేసేంత మూర్ఖుడిని కాద‌ని, త‌న పోరాటం ఆపే ప్ర‌స‌క్తే లేదని తేల్చిచెప్పాడు ఆ వీరుడు.

పోరాడిన అదే నేల‌పై..

అదే స‌మ‌యంలో చౌరాచౌరీ ఘటనతో సహాయనిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు గాంధీజీ ప్రకటించారు. గాంధీ ఆదేశానుసారం నడచుకోవాలనే హనుమంతు నిర్ణ‌యించుకున్నారు. అయితే, హ‌నుమంతుతో ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మ‌ని భావించిన రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ అత‌న్ని హ‌త‌మారిస్తే ప్ర‌జ‌ల‌ను పోరాటాల‌నుంచి దూరం చేయ‌వ‌చ్చ‌ని ప‌న్నాగం ప‌న్నాడు. 1922 ఫిబ్రవరి 22న పుల్లరి చెల్లించకుంటే ఊరిలోని పశువులన్నిటినీ స్వాధీనం చేసుకుంటామంటూ పోలీసులు గ్రామంలోకి ప్ర‌వేశించారు. అడ్డుకున్న రైతుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి తెగ‌బ‌డ్డారు. విష‌యం తెలుసుకున్న హ‌నుమంతు అక్క‌డి ప్ర‌జ‌లు చెల్లించాల్సిన ప‌న్నులు తానే చెల్లిస్తాన‌ని న‌చ్చ‌జెప్పేందుకు ప్ర‌య‌త్నించాడు.

అయితే, అప్ప‌టికే సిద్ధంగా ఉన్న పోలీసులు హ‌నుమంతుపై విచ‌క్ష‌ణా రహింతంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. అత‌ని శ‌రీరంలో ఏకంగా 26 తుపాకీ గుళ్లు చొచ్చుకుపోయాయి. దాంతో హ‌నుమంతు స్వేచ్ఛ‌కోసం పోరాడిన అదే నేల‌పై కుప్ప‌కూలారు. వందేమాత‌ర నినాదంతో తుది శ్వాస విడిచారు. అయితే, హ‌నుమంతును భౌతికంగా లేకుండా చేయ‌గ‌లిగారు కానీ, అత‌ని పోరాట స్ఫూర్తిని ప్ర‌జ‌ల మ‌న‌సులోంచి తొల‌గించ‌లేక‌పోయారు. స్వాతంత్య్ర ఉద్య‌మంలో ప‌ల్నాడు ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఉత్సాహంగా పాల్గొనేలా చేసిన హ‌నుమంతు త్యాగం చిర‌స్మ‌రనీయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+