
Rains In AP: ఆంధ్రప్రదేశ్‍కు వర్ష సూచన.. ఎప్పటి నుంచి అంటే..
ఈ నెల 29 నుంచి ఏపీకి వర్ష సూచన ఉన్నట్ల వాతావరణం శాఖ తెలిపింది. సిత్రంగ్ తుపాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిరది. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సిత్రాంగ్ తుఫాను
సిత్రాంగ్ తుఫాను కారణంగా ఏపీ, తెలంగాణలో చలి తీవ్రతపెరుగింది. తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ బీభత్సానికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాక్స్ బజార్ తీరం నుంచి వేల మందిని పునారావాస కేంద్రాలకు తరలించారు. 576 షెల్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.