వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థియేటర్ మాజీ యజమాని కొడుకు మృతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: ఏపీలోని విశాఖకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, జ్యోతి థియేటర్‌ గత యజమాని కుమారుడు కొల్లి వెంకటరామ ప్రసాద్‌ (63) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయన చెవి కింది భాగంలో తుపాకీ బుల్లెట్‌ తగిలిన గాయం వుండడంతో ఎవరైనా తుపాకీతో కాల్చారా? లేక ఆయన చేతిలో వున్న తుపాకీ మిస్‌ఫైర్‌ అయిందా? అనే విషయం తేలాలి. ప్రసాద్‌ ప్రస్తుతం ఎండాడలో ఉంటున్నారు.

ఆయన తండ్రి పూర్ణచంద్రరావు వ్యాపారవేత్త. ఆయన తర్వాత జ్యోతి థియేటర్‌ను ప్రసాద్‌ ఇతరులకు విక్రయించేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ప్రసాద్‌ భార్య మురళీశ్యామ్‌లీ బెంగళూరులో ఉంటున్నారు. కుమారుడు రాంచంద్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్‌ తరచూ హైదరాబాద్‌, బెంగళూరు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రసాద్‌ సోమవారం హైదరాబాద్‌ నుంచి ఎండాడలోని తన ఇంటికి వచ్చారని సమాచారం.

ప్రసాద్‌కు వేట సరదా ఉండటంతో రైఫిళ్లకు లైసెన్స్‌ పొందారు. సోమవారం 4గురు స్నేహితులతో కలిసి ప్రసాద్‌ ఏజెన్సీ మాదిరిగా ఉండే విజయనగరం జిల్లా వెదురువాడ శివారు ఎంకేపాలెం వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఏం జరిగిందోగానీ అపస్మారక స్థితిలో వున్న ప్రసాద్‌ను అతని ఫ్రెండ్స్ మంగళవారం కేజీహెచ్‌‌కు తీసుకువచ్చారు.

అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసాద్‌తోపాటు అక్కడికి వెళ్లిన నలుగురు మిత్రులు ఎవరనేది తెలియలేదు. మరోవైపు, పాంహౌస్‌లో ఉన్న దూళిని బట్టి దానిని అసలు తెరవలేదని తెలుస్తోంది. కాపలా వున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

డ్రగ్స్ రాకెట్ ముఠా అరెస్ట్

మృతి

మృతి

ఏపీలోని విశాఖకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, జ్యోతి థియేటర్‌ గత యజమాని కుమారుడు కొల్లి వెంకటరామ ప్రసాద్‌ (63) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

డ్రగ్ రాకెట్

డ్రగ్ రాకెట్

విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫిషింగ్ హార్బర్ వద్ద మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

డ్రగ్ రాకెట్

డ్రగ్ రాకెట్

విశాఖకు చెందిన పైడిరాజు, సాయికృష్ణ, బాలకృష్ణ, శివకుమార్‌లు గత కొద్దికాలంగా ఒడిశా నుండి తీసుకు వచ్చిన మత్తు మందుల్ని నగరంలో విక్రయిస్తున్నారు.

డ్రగ్ రాకెట్

డ్రగ్ రాకెట్

వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి.. అరెస్టు చేశారు. వారి నుండి రూ.1.14 లక్షల విలువైన 1140 ఫోర్డ్విన్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫిషింగ్ హార్బర్ వద్ద మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

విశాఖకు చెందిన పైడిరాజు, సాయికృష్ణ, బాలకృష్ణ, శివకుమార్‌లు గత కొద్దికాలంగా ఒడిశా నుండి తీసుకు వచ్చిన మత్తు మందుల్ని నగరంలో విక్రయిస్తున్నారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి.. అరెస్టు చేశారు. వారి నుండి రూ.1.14 లక్షల విలువైన 1140 ఫోర్డ్విన్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Theatre owner's on dies in Vishaka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X