మహేష్ బ్యాంక్‌లో భారీ చోరీ: దర్యాప్తు షురూ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ చోరి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఏఎస్‌రావు నగర్ మహేష్‌బ్యాంక్‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ వెనుక భాగంలో షెటర్ తెరిచి లోనికి వెళ్లిన దుండగులు దాదాపు రూ.4.5 కోట్ల విలువ చేసే నగలు అపహరించారు.
రోజువారి చెల్లింపుల కోసం ఉంచిన 22 లక్షల రూపాయలు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లారని తేలింది. ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంక్ మేనేజర్ జెట్టి తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వార్తను తెలుసుకున్న బాధితులు బ్యాంకు కార్యాలయానికి తరలివచ్చి అధికారులను ప్రశ్నించారు.

మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో దుండగులు కేవలం బంగారం మాత్రమే దోచుకెళ్లారని ఆల్వాల్ పోలీసు ఉన్నతాధికారి నవదీప్ సింగ్ చెప్పారు. నగదు చోరీ కాలేదని ఆయన చెప్పారు. గ్రిల్స్ తొలగించి వారు బ్యాంకులోకి చొరబడ్డారని ఆయన చెప్పారు.

శుక్రవారం ఉదయం బ్యాంకును తెరిచేందుకు వచ్ిచన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మల్కాజ్‌గిరి డిసిపి గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications