అప్పుడు కేటీఆర్, ఇప్పుడు జగన్- ఎగ్జిట్ పోల్ ఫలితాల వేళ ట్వీట్ వైరల్..!
ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఇవాళ పలు మీడియా ఛానళ్లు, సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఆలోపే సీఎం జగన్ తిరిగి గెలుస్తున్నారంటూ వైసీపీ ఎక్స్ లో ఓ ట్వీట్ చేసింది. దీన్ని గతంలో తెలంగాణ నేత కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన ఓ ట్వీట్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. ఈ పోలికపై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.

గతేడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో పోలింగ్ తర్వాత ఇలాగే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అదే సమయంలో బీఆర్ఎస్ మంత్రిగా ఉన్న కేటీఆర్.. తాము తిరిగి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించబోతున్నామనే అర్ధం వచ్చేలా 3.0 స్లోగన్ తో ట్వీట్ చేశారు. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ ఓడిపోయింది.
ఇప్పుడు ఏపీలోనూ సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన తరుణంలో జగన్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారనే అర్ధం వచ్చేలా 2.0 లోడింగ్ అంటూ వైసీపీ చేసిన ట్వీట్ ను నెటిజన్లు కేటీఆర్ పాత ట్వీట్ తో జత చేసి సెటైర్లు వేసుకుంటున్నారు. అప్పట్లో గెలుస్తామనే భ్రమల్లో ఉన్న కేటీఆర్ పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడు జగన్ కూడా అలాగే చెప్పుకుని ఓడిపోతున్నారనే అర్ధం వచ్చేలా ట్వీీట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications