Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి లేదు ; శ్రీవారి దర్శనానంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నిన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కిషన్ రెడ్డి వెంట ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా స్వామివారి దర్శనానికి వెళ్లారు. తిరుపతిలో స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు.

 రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదన్న కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదన్న కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని కేంద్ర పథకాల పనుల్లో రాష్ట్రం ఖర్చు చేయాల్సిన వాటా నిధులు లేక పనులలో జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని కిషన్ రెడ్డి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్న కిషన్ రెడ్డి సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలి అనేది కేంద్రం ఉద్దేశమని వెల్లడించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కరోనా సమయంలో 4500 వెంటిలేటర్లు, ఏపీ అవసరాలకు తగ్గట్టుగా ఇంజెక్షన్లను ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 కేంద్రం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుంది

కేంద్రం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలను మంజూరు చేసిందని, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసిందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని అంతర్జాతీయ మాఫియాను అంతమొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

వచ్చే జనవరి నుంచి డిసెంబర్ వరకు పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి .. రీజన్ ఇదే

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి .. రీజన్ ఇదే

కరోనా మూడవదశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కూడా కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని స్వామివారిని ప్రార్థించానని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ పాలన ఏళ్లు పూర్తయిన సందర్భంగా జన ఆశీర్వాద యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి బయల్దేరిన కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం చిత్తూరు జిల్లాకు చేరుకున్న ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ర్యాలీ నిర్వహించారు. నిన్న పార్టీ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకుని, అనంతరం దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకుని తెలంగాణా జన ఆశీర్వాద యాత్రకు వెళ్లనున్నారు.

Recommended Video

    Spl Interview with tpcc leader Vijaya rama Rao on Indravalli meeting
    తెలంగాణా రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నేటి సాయంత్రం నుండే

    తెలంగాణా రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నేటి సాయంత్రం నుండే

    తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. కోదాడ నుండి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభం అవుతుంది. ఇక ఏపీలో తిరుపతి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాలలో కిషన్ రెడ్డి పర్యటిస్తుండగా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఏడు పార్లమెంటు నియోజకవర్గాలలో కిషన్ రెడ్డి పర్యటన సాగనుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లడానికి, కేంద్రం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రజల్లో సానుకూల దృక్పధాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు రంగంలోకి దిగుతున్న క్రమంలో, కిషన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాలలో పర్యటనతో రంగంలోకి దిగారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+