కేరళలో ఈడీ టీమ్ పై సీపీఎం దాడులు..! మాజీ సీఎం ఇంట్లో సోదాలపై ఆగ్రహం..!
కేరళలో ఇవాళ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంట్లో సోదాలకు వెళ్లిన ఈడీ (ED) అధికారులకు సీపీఎం (CPI(M))కార్యకర్తలు షాకిచ్చారు. దాడులతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈడీ అధికారుల కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసుతో సంబంధం ఉన్న పినరయి విజయన్ ఇంటిపై ఈడీ సోదాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు ఇలా దాడులకు దిగారు.
ఈడీ బృందం ప్రయాణిస్తున్న వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేయడంతో తిరువనంతపురంలో హింస చెలరేగింది.
తిరువనంతపురంలోని నివాస సముదాయం నుంచి ఈడీ బృందం బయటకు వచ్చిన తర్వాత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇంటి బయట వారి వాహనంపై సీపీఐ(ఎం) కార్యకర్తలు రాళ్లు రువ్వారు.

#WATCH | Keralam: CPI(M) workers attack a vehicle of ED officials in Thiruvananthapuram. The workers are protesting against the central agency over its searches at 10 premises in Keralam, including the residences of former Chief Minister and present LoP Pinarayi Vijayan, in the… pic.twitter.com/HlrsQmKJOS
— ANI (@ANI) May 27, 2026
సీఎంఆర్ఎల్ కేసుకు సంబంధించి పినరయి విజయన్‌కు సంబంధించిన ప్రాంగణాలతో సహా కేరళ వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈడీ ఇవాళ ఉదయం నుంచీ సోదాలకు దిగింది. దీంతో రాష్ట్రంలో సీపీఎం నిరసనలు ప్రారంభమయ్యాయి. విజయన్ నివాసం బయట పార్టీ కార్యకర్తలు గుమిగూడి కేంద్ర దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ప్రదేశంలో తీవ్ర గందరగోళం సృష్టించారు. గుంపును నియంత్రించి, ఉద్రిక్తత పెరగకుండా అడ్డుకునేందుకు అక్కడ బారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఘర్షణల సమయంలో, నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు కూడా గాయపడ్డారు.
పినరయి విజయన్ కుమార్తె వీణా తైక్కండియిల్ సంస్థకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న, రాజకీయంగా సున్నితమైన కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. విజయన్ ఇటీవల మారిన తిరువనంతపురంలోని ఆయన అద్దె నివాసంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications