రూ.30 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్ పేట MRO మేడమ్!
తెలంగాణా రాష్ట్రంలో ఇంకా తహసీల్దార్ వ్యవస్థలో అవినీతి వేళ్ళూనుకునే ఉంది అని చెప్పటానికి తాజాగా ఒక ఘటన ఉదాహరణగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం చేసిన ఆకస్మిక దాడి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్వో ఆఫీసులలో జరిగే అవినీతిపై చర్చకు కారణమైంది.
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తహసీల్దార్
తాజాగా భూమి కన్వర్షన్ వ్యవహారంలో భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై ఏసీబీ దాడులు చేపట్టి, తహసీల్దార్ ను, డ్రైవర్‌ను రూ.2 లక్షల లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.

భూమి కన్వర్షన్ కు 30 లక్షల డిమాండ్
ఆలియాబాద్ ప్రాంతంలోని సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఏసీబీ విచారణ చేపట్టింది. ప్రాథమిక తనిఖీలో ఆరోపణలు నిజమైనట్లు తేలడంతో ఏసీబీ ట్రాప్ వేసి చర్యలు తీసుకుంది. తహసీల్దార్ ఆఫీసు డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు అందుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎమ్మార్వో ఆఫీస్ లో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు
ఈ సందర్భంగా కార్యాలయంలోని ముఖ్యమైన భూమి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకుని విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుత తహసీల్దార్ సుచరితను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు కీసర ఆర్‌డీఓ రాజేష్‌తో సహా ఇతర సిబ్బందిని కూడా విచారణకు పిలిచినట్లు సమాచారం. గత ఏడాది (2024) కూడా అదే శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి.
గతంలో వివాదాలకు కేరాఫ్ గా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం
అప్పటి తహసీల్దార్ సత్యనారాయణ తన డ్రైవర్‌తో కలిసి రూ.2 లక్షల లంచం కేసులో అరెస్ట్ అయ్యారు. తాజా ఘటనతో శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మళ్లీ వివాదాస్పదం అయింది.ఏసీబీ అధికారులు ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. భూమి సంబంధిత అనుమతులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడం అనేది సాధారణంగా మారిపోతున్నట్లు ఈ ఘటనలు చూపిస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.













Click it and Unblock the Notifications