సమంత, నేను జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లాం - శ్రీముఖి
శ్రీముఖి.. తెలుగు బుల్లితెరపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్‌ను చిన్న వయసులోనే ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఒకరిగా ఎదిగింది. తన అద్భుతమైన వాక్చాతుర్యం, గలగలా మాట్లాడే తత్వం.. స్టేజ్ మీద ఆమె చూపించే ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. 'అదుర్స్' వంటి షోలతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ.. మల్లెమాల ప్రొడక్షన్స్ లో వచ్చిన 'పటాస్' షో ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆమెకు 'రాములమ్మ' అనే పేరు కూడా ఈ షో ద్వారానే పాపులర్ అయింది.
దీంతో ఆమెకు వరుసగా టాప్ ఛానల్స్‌లో అవకాశాలు రావడం మొదలైంది. స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్స్‌లో ప్రైమ్ టైమ్ షోలకి ఆమె ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం', 'సా రి గ మ ప', 'స్టార్ట్ మ్యూజిక్' వంటి షోల ద్వారా ఆమె తన యాంకరింగ్ రేంజ్‌ను మరింత విస్తరించారు. టెలివిజన్‌తో పాటు వెండితెరపై కూడా Sreemukhi తన ప్రయాణాన్ని కొనసాగించారు.

2012లో విడుదలైన జులాయి మూవీలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత Prema Ishq Kaadhal చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. Nenu Sailajaలో Ram Pothineni సోదరిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో, భోళాశంకర్ తదితర సినిమాల్లోనూ నటించి మెప్పించిందీ అందాల తార.
అయితే Bigg Boss Telugu Season 3లో పాల్గొనడం Sreemukhi కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ షోలో ఆమె చూపించిన పట్టుదల, టాస్క్‌లలో పోరాటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టైటిల్ గెలవకపోయినా రన్నరప్‌గా నిలిచి, కోట్లాది అభిమానులను సంపాదించారు.
ఈ షో తర్వాత ఆమెకు వచ్చిన క్రేజ్ రెట్టింపు అయ్యి, పెద్ద షోల హోస్టింగ్ అవకాశాలు వరుసగా దక్కాయి. ఇక ఇప్పుడు టెలివిజన్, సినిమాల తర్వాత Sreemukhi కొత్తగా వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ మస్త్ బిజీగా ఉంటోందీ అందాల తార. కాగా టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీముఖికి అవకాశం లభించింది. జూన్ 19న విడుదల కానున్న 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగగా శ్రీముఖి చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఈ వేడుకలో శ్రీముఖి మాట్లాడుతూ.. "టీవీలో లౌడ్ స్పీకర్‌ని కావొచ్చు, సినిమాలో కోడలి పాత్ర కాబట్టి కొంచెం మెల్లిగానే మాట్లాడతాను" అని సరదాగా చెప్పుకొచ్చారు. "టీవీలో అంత ఉద్వేగంగా ఉంటారు, సినిమాలో అంత సైలెంట్ పాత్ర ఎలా చేశారు? కష్టమనిపించిందా?" అని హోస్ట్ సమీరా భరద్వాజ్ ప్రశ్నించారు. దీనికి శ్రీముఖి "ఈసారి వయలెన్స్ సామ్‌కి ఇచ్చేసి, సైలెన్స్ నేను తీసుకున్నాను. నిశ్శబ్దంగా ఉండటం చాలా కష్టం" అని సమాధానమిచ్చారు. ఈ చిత్రంలో సమంత పెద్ద కోడలు, నేను చిన్న కోడలు అనగానే ఫుల్ రివైలరీ ఉంటుందని సినిమాకు ఒప్పుకున్నానన్నారు.

అలానే సినిమాలో మీ ఇద్దరికీ కోల్డ్‌వార్ ఉంటుందా అని ప్రశ్నించగా, శ్రీముఖి, "ఆల్‌మోస్ట్ జుట్లు పట్టుకునే వరకు వెళ్తాం. మేమిద్దరం అస్సలు పడదు. ఏం జరుగుతుందో చూడాలంటే మీరు సినిమానే చూడాలి" అని బదులిచ్చారు. ఈ చిత్రం నవ్వించింది, ఏడిపించింది, ఫైట్స్ కూడా ఉన్నాయి. మీ అందరి ప్రేమతో సినిమా తప్పక హిట్ అవుతుంది. జూన్ 19న 'మా ఇంటి బంగారం'ను థియేటర్లలో చూడండి" అని కోరారు.












Click it and Unblock the Notifications