'బీజేపీతో విభేదాల పరిష్కారం', రాందేవ్ బాబా సాయం తీసుకోవాలని బాబు
విజయవాడ: తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అయ్యన్న పాత్రుడు గురువారం నాడు తెలిపారు. నేతలు మాణిక్యాల రావు, బాపిరాజులను కూర్చోబెట్టి మాట్లాడుతామని చెప్పారు. ఇటీవల ఇరువురి మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.
మొక్కలు నాటాలి: చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అధికారులకు సూచించారు. అమరావతిలోని తన నివాసంలో ఎర్రచందనం పరిరక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

జులై చివరి వారంలో కోటి మొక్కల కార్యక్రమం చేపడతామన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి పెంపకం, పరిరక్షణ ఎంతో ముఖ్యమన్నారు. బయోఫెన్సింగ్, జియో ట్యాగింగ్ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకానికి రాష్ట్రస్థాయిలో త్వరలో ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.
బాపిరాజుతో విభేదాలు తారాస్థాయికి: రాజీనామాకు సిద్ధమైన మాణిక్యాలరావు!, బాబు ఫోన్
ప్రపంచంలో ఉన్న వివిధ రకాల మొక్కలను రాష్ట్రంలో నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయుర్వేద మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఔషధ మొక్కల ఏర్పాటుపై బాబా రామ్‌దేవ్, జగ్గీ వాసుదేవ్ సూచనలు తీసుకోవాలన్నారు.
రాయనపాడులో త్వరలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని, విమానయానశాఖ సహకారంతో అటవీ ప్రాంతాల్లో పెద్దఎత్తున విత్తనాలు చల్లే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. నందనవనం ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఎకో టూరిజం ప్రాజెక్టు బాధ్యతను అటవీ శాఖ తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications