ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు వీరే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు లోకేష్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ లు పని చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు గా మారాలన్న లోకేష్
ఏపీ ఎన్నార్టీ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలైన ఆసక్తి చూపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్నారైలు మారాలని ఆయన పిలుపునిచ్చారు.

ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కృషి
గత 16నెలలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పిన లోకేష్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ విధానం అంటూ పేర్కొన్నారు. ఏపీలో ఐదు సంవత్సరాలలో 20లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం నడుస్తుందని పేర్కొన్న లోకేష్ ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
రాష్ట్రానికి google వంటి పెద్ద సంస్థలు
రాష్ట్రానికి google వంటి పెద్ద సంస్థలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఆయన తెలిపారు. పెట్టుబడుల కోసం కొన్ని చట్టాలలో సవరణలు చేయాలని google కోరినప్పుడు ప్రధాని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారంటూ లోకేష్ కొనియాడారు. రాబోయే 15సంవత్సరాలు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారని అదే దిశగా తాము కూడా కృషి చేస్తామన్నారు లోకేష్.
చంద్రబాబు వేగాన్ని అందుకోలేక పోతున్నామన్న లోకేష్
ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్రం మద్దతు ఇచ్చిందని లోకేష్ అన్నారు. ఎన్టిపిసి గ్రీన్ కారిడార్, నక్కపల్లి ఫార్మసీ, కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ లు వంటి ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేగాన్ని అందుకోలేక పోతున్నామని లోకేష్ అన్నారు. ఆయన క్వాంటం కంప్యూటర్ గురించి మాట్లాడినప్పుడు తను చాట్ జిపిటి నుండి వెతికి తెలుసుకున్నానని చెప్పారు.
సొంత రాష్ట్రాన్ని విడిచి వచ్చిన వాళ్ళు ఎన్నారైలు కాదు
చంద్రబాబుకు ఉన్న నాలెడ్జ్ కి ఆయనను విజనరీ అన్నారని ప్రశంసించారు. సొంత గ్రామాలను, సొంత రాష్ట్రాన్ని విడిచి వచ్చిన వాళ్ళు ఎన్నారైలు కాదని వారంతా మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ ఎంఆర్ఐలు అంటూ లోకేష్ పేర్కొన్నారు. మీరంతా కచ్చితంగా ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని ఆయన వారిని కోరారు.












Click it and Unblock the Notifications