ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. గుళ్ళో పెళ్ళిచేసుకొన్నారు. తర్వాత ఏమైందంటే

ప్రేమించి పెళ్ళిచేసుకొని వంచించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది ఓ యువతి,. విజయవాడ పటమటకు చెందిన ఓ యువతి ని హేమంత్ అనే యువకుడు ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. తర్వాత కన్పించకుండా పోయాడు.

హైదరాబాద్ :ప్రేమించిన యువతిని వివాహం చేసుకొన్నాడు. తర్వాత డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలని చూశాడు. అయితే బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతోంది. విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకొంది.

విజయవాడ పటమట దర్శిపేటకు చెందిన ఓ యువతి డిప్లోమా పూర్తి చేసింది. ఆమెకు ఆరుమాసాల క్రితం పటమట కు చెందిన హేమంత్ బాబు అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆగష్టులో ఆ యువతి పుష్కరాల్లో వలంటీర్ గా పనిచేసింది.

ఆమె పుష్కరాల్లో వలంటీర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు ప్రతిరోజూ వచ్చేవాడు.దీంతో వారిద్దరి మద్య పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్ళిచేసుకోవాలని భావించారు.

యువతిని పెళ్ళిచేసుకొనేందుకు తమ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఆ యువతిని దుర్గగుడిలో ఆ యువకుడు ఈ ఏడాది అక్టోబర్ 23వ, తేదిన వివాహం చేసుకొన్నాడు.భవానీపురంలో ఇల్లు తీసుకొని ఐదురోజులపాటు కాపురం చేశారు.

they became lovers with facebook, young lady complient against lover

అయితే యువకుడి తల్లిదండ్రులు వచ్చి సంప్రదాయబద్దంగా వివాహం జరిపిస్తామని చెప్పి హేమంత్ ను తీసుకుపోయారు.దీంతో ఆ యువతి కూడ తన ఇంటికి వచ్చేసింది.

కారులో తీసుకెళ్ళి కొట్టారు.

ఆ తర్వాత హేమంత్ బంధువు రామారావు వచ్చి నువ్వంటే హేమంత్ కు ఇష్టం లేదంటూ ఐదు లక్షలు తీసుకొని అన్ని మర్చిపోవాలని యువతికి చెప్పాడు. ఆ తర్వాత ఆమెను కారులో తీసుకొని వెళ్ళాడు. హేమంత్ ను మర్చిపోవాలని కొట్టాడని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె పట్టించుకోవడం లేదన్నారు.

దీంతో స్ధానిక ప్రజాప్రతినిధులను తీసుకొని ఆమె పోలీసు ఉన్నతాధికారులను సోమవారంనాడు కలిసింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరింది.నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తామని వారు హమీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+