బురఖా వేసుకొని ఇంట్లోకి చొరబడ్డ దొంగ...అరిచిందని పొడిచాడు
గుంటూరు:దొంగలు తెలివిమీరారు...పట్టపగలే ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీలు చేసేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోరీకి వచ్చిన ఓ దోపిడీ దొంగ ఉదంతం జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే....
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో బురఖా వేసుకొన్న ఓ మహిళ హఠాత్తుగా ఓ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో మహిళ వంటరిగా ఉండటం చూసి బురఖాతో వచ్చిన మహిళ తన నిజస్వరూపం చూపించగా, అప్పుడు ఆ బురఖా వేసుకొని వచ్చింది మహిళ కాదని పురుషుడు అని తెలిసింది. మొహంపై బురఖా ముసుగు తప్పించిన దొంగ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తి చూపుతూ బీరువాలోని నగదు, బంగారం తీసి ఇవ్వమని బెదిరించాడు.

దీంతో భయపడిపోయిన ఆ మహిళ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ప్రతిఘటించింది. దీంతో కంగారు పడిన ఆ దొంగ మహిళను అరవద్దంటూ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈమె కేకలు విన్న చుట్టుపక్కలవారు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మహిళను ఆస్పత్రికి తరలించి అనంతరం జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications