బాబుకి కేంద్రం గుర్తొచ్చింది: పద్మ, ఇక్కడ భద్రత లేదు: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వెళ్లారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ బుధవారం అన్నారు. మీకు కష్టాలు వచ్చినప్పుడు కేంద్రం గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.
మీ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని పద్మ ఆరోపించారు. అసలు అది తెలుగుదేశం పార్టీనా లేక దొంగల పార్టీనా అని ప్రశ్నించారు. మీ సొంత సమస్యను ప్రజల సమస్యగా చేయవద్దన్నారు.

భద్రత లేదు: యనమల
ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ దారుణమని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ పైన తమకు పక్కా సమాచారం ఉందని చెప్పారు. సెక్షన్ 8 ప్రకారం హైదరాబాదులో గవర్నర్ అధికారాలు అమలు కావడం లేదన్నారు. ఈ అంశాన్నింటిని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వివరిస్తామన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి మేం ముందుకు వచ్చినా, కేసీఆర్ సహకరించడం లేదన్నారు.
మావోయిస్టు పార్టీ లేఖ
ఓటుకు నోటు వ్యవహారంపై మావోయిస్టు పార్టీ బహిరంగ లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. అందుకు ఆయనను జైలులో పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications