ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
మంగళగిరి పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ జెండా వందనం సమయంలో చేసిన తప్పు ప్రత్యర్థి వర్గాలు ఆయనను టార్గెట్ చెయ్యటానికి కారణంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో రకంగా రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఎప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా ప్రత్యర్థి పార్టీలకు ఇట్టే దొరుకుతున్నారు. ఇక ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా భూతద్దం పెట్టి చూసేవాళ్ళు ఏపీలో పెరిగిపోయారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రచార రథం ప్రచార బరిలోకి దిగుతున్న వేళ వారాహి వాహనం పందిబస్సు వారాహి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడానికి మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు కారణమయ్యాయి. ఇంతకు ఏం జరిగిందంటే..

రిపబ్లిక్ డే వేడుకల్లో పవన్ కళ్యాణ్ మిస్టేక్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన, రాజ్యాంగం అమలులోకి తీసుకువచ్చిన జనవరి 26వ తేదీని రిపబ్లిక్ డే గా మనమందరం నిర్వహించుకుంటాం. అందులో భాగంగానే నిన్న 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించారు.
దేశభక్తి ఉట్టిపడేలా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కళ్యాణ్, పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసేటప్పుడు, జెండా వందనాన్ని చేసేటప్పుడు చెప్పులు విప్పడం మరిచిపోయారు.
జెండా వందనం చేసిన ఫోటోలతో ట్రోల్
చెప్పులు వేసుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాను అవమానించారు. చెప్పులు వేసుకునే జాతీయ గీతాలాపన చేశారు పవన్ కళ్యాణ్. దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు పలువురు వైసిపి కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ చెప్పులేసుకునే జెండా ఎగరేసిన ఫోటోలను ఫోకస్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చెప్పులు వేసుకుని జండా ఎగరవేస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి మరి ట్రోల్ చేస్తున్నారు.
ప్యాకేజ్ స్టార్ దేశభక్తి ఇది.. రచ్చ షురూ
ఇది ప్యాకేజీ స్టార్ట్ దేశభక్తి అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు దేశం మీద శ్రద్ధ ఉంటే ఇలా చేస్తాడు అంటూ తిట్టిపోస్తున్నారు. చెప్పులతో జెండా ఆవిష్కరణ చేసిన పవన్ కళ్యాణ్ దేశాన్ని అవమానించారని... చెత్త వెధవ అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల మీద ఉన్న శ్రద్ధ, జాతీయ జెండా మీద ఎక్కడిది పవన్ కళ్యాణ్ కు అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటల్లో దేశభక్తి, పనుల్లో ఉండదని పోస్టులు పెడుతున్నారు.

పవన్ చేసిన తప్పు.. ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా
మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ కార్యాలయంలో అంతా బాగానే జరుపుకున్నారు అనుకున్న వేళ, చెప్పులు వేసుకుని జండా వందనం చేసిన రగడ ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పవన్ కళ్యాణ్, చెప్పులు విప్పి జెండాని ఎగరవేసి జండా వందనం చేయాలన్న కనీస దేశభక్తిని మర్చిపోవడం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారింది. మరి ఇక ఈ ట్రోలింగ్స్ ఎప్పటి వరకు కొనసాగుతాయో, దీనికి జనసేన నాయకులు ఎలా బదులిస్తారో వేచి చూడాలి.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications