వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్నటి వరకు ఎన్నికలు.. ఇప్పుడు రివ్యూలు .. ఏందీ బాబూ ఈ రచ్చ..! తమ్ముళ్లలో ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అనేక సమస్యలతో సతమతమవుతున్న చంద్రబాబు నాయుడుకు ఇంటిపోరు తలనొప్పిగా పరిణమించింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ పంచాయితీని చంద్రబాబు ముందుపెట్టడం ఆయనకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఏప్రిల్ 11న ఎన్నిక‌లు జ‌రిగాయి. మే 23 ఫ‌లితాలు రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి వారు త‌మ‌కు పోలైన ఓట్ల‌ను లెక్కలేసుకునే ప‌నిలో ప‌డ్డారు. కొన్ని జిల్లాల్లో సొంత పార్టీ నేతలే ప్రతిపక్షంతో కుమ్మక్కై తమ ఓట్లకు గండి కొట్టారని బాబు దగ్గర బోరుమంటున్నట్టు తెలుస్తోంది.

లోతుగా సమీక్షించుకుంటున్న తమ్ముళ్లు..! ఎవరు తమ ఓట్లు చీల్చారో అని ఆరా..!!

లోతుగా సమీక్షించుకుంటున్న తమ్ముళ్లు..! ఎవరు తమ ఓట్లు చీల్చారో అని ఆరా..!!

ప్రతిపక్ష వైసీపీ మాత్రం గెలుపు పట్ల ధీమాగా ఉంది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ తామే నెగ్గుతామంటూ చెబుతోంది. స‌ర్వేలు.. అంకెలు.. లెక్కలు అన్నీ త‌మ‌కే అనుకూలం అంటున్నారు. అయితే టీడీపీలో ఎక్కడో మూల‌న చిన్నపాటి అనుమానం. అందుకే.. స్వయంగా చంద్రబాబు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నేత‌ల‌తో స‌మీక్ష చేస్తున్నారు. పోలింగ్ బూత్ ల వారీగా.. లెక్కలేస్తున్నారు.

 అనంతపురంలో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం..! పైచేయి కోసం ఎన్నో పాట్లు..!!

అనంతపురంలో నువ్వా నేనా అన్నట్టు రాజకీయం..! పైచేయి కోసం ఎన్నో పాట్లు..!!

ఇటువంటి స‌మ‌యంలో ఉత్తరాంధ్ర నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కూ చాలా మంది ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. అంత‌ర్గతంగా త‌మ‌ను దెబ్బతీసేందుకు విప‌క్షంతో దోస్తీచేసి వెన్నుపోటు పొడిచారంటూ ప‌లువురు నేత‌లు ఆయ‌న వ‌ద్ద పంచాయ‌తీ పెట్టార‌ట‌. తాము ఓడితే కార‌ణం.. వెన్నుపోటు పొడిచిన నాయ‌కుల‌దేనంటూ చెప్పార‌ట‌. అనంత‌పురంలో జేసీ దివాక‌ర్‌రెడ్డి త‌మ‌పై క‌క్షపూర్వకంగా వ్యవ‌హ‌రించారంటూ ప‌లువురు టీడీపీ నేత‌లు బాబు వ‌ద్ద వాస్తవాలు వెల్లడించార‌ట‌. ఆ జాబితాలో ప‌రిటాల శ్రీరామ్‌, ప్రభాక‌ర్‌చౌద‌రి ఇద్దరూ ఉన్నార‌నే గుస‌గుస‌లూ వినిపిస్తున్నాయి.

కర్నూలులో కుమ్ములాటలు..! ఇబ్బంది పడుతున్న అదిష్టానం..!!

కర్నూలులో కుమ్ములాటలు..! ఇబ్బంది పడుతున్న అదిష్టానం..!!

క‌ర్నూలులోనూ అధిక‌శాతం టీడీపీ నేత‌లు అంత‌ర్గత కుమ్ములాట‌ల‌తో ఒక‌ర్నోక‌రు ఓడించుకోవాల‌నే ఉద్దేశంతోనే ప‌నిచేశార‌ట‌. భూమా అఖిల ప్రియ కూడా కొంద‌రి ప‌ట్ట వివ‌క్షత చూపార‌ని తెలుస్తోంది. క‌డ‌ప‌లోనూ సీఎం ర‌మేష్ వ‌ర్గం ఆదినారాయ‌ణ‌రెడ్డికి వ్యతిరేకంగా ప‌నిచేశార‌ట‌. అలాగే నెల్లూరులో సోమిరెడ్డి, నారాయ‌ణ‌ల ఓట‌మి కోసం.. తెదేపాలోని ఓ వ‌ర్గం తీవ్రంగా శ్రమించింద‌ట‌. కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ తూర్పు, గుడివాడ‌, జ‌గ్గయ్యపేట‌లో నూ ఇదే ప‌రిస్థితి ఉంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు , న‌ర్సరావుపేట ఎంపీ సీట్లకూ గ‌ల్లా జ‌య‌దేవ్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావుల‌ను చీలిక ఓట్లు భ‌య‌పెడుతున్నట్టు చర్చ జరుగుతోంది.

 పంచాయతీ చంద్రబాబు దగ్గరకు..! సర్థి చెప్పలేకపోతున్న బాస్..!!

పంచాయతీ చంద్రబాబు దగ్గరకు..! సర్థి చెప్పలేకపోతున్న బాస్..!!

పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీకు పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఎంపీల‌కు ఆశించినంత స‌హ‌కారం అందించ‌లేదంటూ వాపోయార‌ట‌. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని కూడా.. త‌న‌ను ఓడించేందుకు కొంద‌రు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎత్తులు వేశార‌ని.. త‌న త‌ర‌పున ప్రచారానికి రాకుండా ఇబ్బందిపెట్టార‌ని.. మే 23 త‌రువాత ఆ నేత‌లు ఎవ‌ర‌నేది తానే బ‌య‌ట‌పెడ‌తానంటూ మిత్రుల వ‌ద్ద ఆందోళ‌న వ్యక్తంచేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏ నిర్ణయం తీసుకుంటే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌నే ఉద్దేశంతో చంద్రబాబు కొద్దిరోజులు వేచిచూద్దామంటూ.. వారిని బుజ్జగించినట్టు తెలుస్తోంది.

English summary
Elections were held on April 11. May 23 results are coming. In this background, tdp leaders have come to work counting votes that they have lost. It seems that in some districts, own party leaders are mingle with opposition and reduced their their own votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X