టీడీపీ-జనసేన పొత్తు రోడ్ మ్యాప్ ఖరారు ! మధ్యలో బీజేపీ చేరిక ?.. అందరికీ ప్రయోజనం ఇలా..?

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఇరు పార్టీలు సంకేతాలు ఇచ్చేశాయి. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గతేడాదే చెప్పేసిన వీరిద్దరూ.. ఇప్పుడు పొత్తు ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఎక్కడ కొనసాగాలన్న దానిపైనా ఓ నిర్ణయానికి వచ్చేశారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు రోడ్ మ్యాప్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

టీడీపీ-జనసేన పొత్తు రోడ్ మ్యాప్

టీడీపీ-జనసేన పొత్తు రోడ్ మ్యాప్

ఏపీలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుకు రోడ్ మ్యాప్ ఖరారైంది. ఇప్పటికే కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టేసిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు అధికారికంగా ఆ ప్రకటన చేయడమే తరువాయి. అయితే ఈ ప్రకటనకు ముందు చేయాల్సిన హోంవర్క్ చేసుకుంటున్న ఇరు పార్టీలు.. తమ ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ముగించాలన్న దానిపై వర్కవుట్ చేస్తున్నాయి. దీని ప్రకారం ఇరు పార్టీల మధ్య పొత్తులో బీజేపీ ఎక్కడ చేరాలన్న దానిపైనా ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికలతో మొదలు

తెలంగాణ ఎన్నికలతో మొదలు

తెలంగాణలో ఈసారి కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దింపి అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకోసం పనికొచ్చే ఏ వ్యూహాన్నీ, సమీకరణాన్నీ వదిలిపెట్టడం లేదు. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బలంగా ఉన్న కమ్మసామాజిక వర్గం సాయం కోసం టీడీపీని ఆశ్రయిస్తోంది. టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు బీజేపీ తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ నిన్న ఇచ్చిన సంకేతాలు ఇందులో భాగమే. దీంతో తెలంగాణలో టీడీపీ-బీజేపీ రూపంలో ఈ పొత్తు మొదలుకాబోతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో ప్రయాణిస్తున్న జనసేనకు ఇప్పుడు టీడీపీ కూడా జత కలవబోతోందన్నమాట. అంటే తెలంగాణలో టీడీపీ-జనసేన-బీజేపీ త్రయం పొత్తు మొదలుకానుంది.

తెలంగాణ నుంచి ఏపీకి ఇలా..

తెలంగాణ నుంచి ఏపీకి ఇలా..

తెలంగాణలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలిసి పోటీ చేయబోతోంది. ఈ పొత్తుకు గతంలో అమిత్ షా, నడ్డా వరుస పర్యటనల్లోనే బీజాలు పడ్డాయి. అప్పట్లో సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి వారితో భేటీలు, మీడియా దిగ్గజం రామోజీరావుతో అమిత్ షా భేటీ వంటి పరిణామాలన్నీ ఇందులో భాగమే. ఈ పొత్తుతో ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రహీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ కూటమికి తొలిసారి ప్రచారం చేయబోతున్నారు. దీంతో ఈసారి తెలంగాణ వాదం మసకబారిన ఎన్నికల్లో ఎలాగైనా లబ్దిపొందేందుకు ఏపీ మూలాలున్న చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ద్వయం ఉమ్మడిగా ప్రచారం చేయబోతోంది. అనంతరం ఇదే ప్లాన్ ఏపీకి కూడా వర్తింపచేస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగియగానే వీరు ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఇక్కడి రాజకీయాలపైనా సీరియస్ గా దృష్టిపెట్టి ఎన్నికల్ని హోరెత్తించబోతున్నారు.

అందరికీ ప్రయోజనం ఇలా.. !

అందరికీ ప్రయోజనం ఇలా.. !


టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుతో ముందుగా తెలంగాణ ఎన్నికల్లో భారీగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ-జనసేన పొత్తు ఉన్నా తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు టీడీపీ ఎంట్రీతో దూకుడు పెంచేందుకు అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీడీపీ, ఉత్తర తెలంగాణలో బీజేపీ.. ఓవరాల్ గా జనసేన, పవన్ ఛరిష్మా పనిచేస్తే తెలంగాణ ఎన్నికల్ని ఈ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఆ తర్వాత ఏపీలో ఎంట్రీ ఇచ్చాక కూడా గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయిన దాదాపు 50కి పైగా స్ధానాల్లో ఇరు పార్టీల అవకాశాల్ని ఈ పొత్తు మెరుగుపర్చబోతోంది. అలాగే గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే ప్రభావం చూపిన బీజేపీ కూడా ఉనికి కాపాడుకోవడం ఖాయం. ఆ మేరకు వైసీపీ ఓట్లకు గండిపడటం కూడా ఖాయం. దీంతో వైసీపీని గద్దెదించి ఈ కూటమి అధికార పగ్గాలు అందుకుంటుందని మూడు పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+