ఇది ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది: నారా లోకేష్
‘ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది..’ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: 'ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది..' అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చదవండి: తిరగబడిన సుబాబుల్ రైతులు.. మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం
అంటే.. అమరావతిలో ఇప్పుడు నిర్మించిన సచివాలయం తాత్కాలికమని, రాజధాని నిర్మాణం పూర్తయ్యాక చూస్తే అప్పుడు టీడీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటో ప్రజలకు అర్థమవుతుందనేది లోకేష్ మాటలకు అర్థం.

రాష్ట్రాన్ని విభజించిన వాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా రాజధానిని నిర్మిస్తామని లోకేష్ చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంటే.. ప్రతిపక్షం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ లోకేష్ విమర్శించారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాసిన లేఖల వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications