వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ స్థానాలు చాలా సున్నితం..! చివ‌రి 30 సీట్ల‌పై చంద్ర‌బాబు తుది క‌స‌ర‌త్తు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Election 2019: TDP President Chandrababu Naidu Has Focused On Pending Positions | Oneindia Telugu

అమరావతి/హైద‌రాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెండింగ్‌ స్థానాలపై దృష్టి సారించారు. పెండింగ్ స్థానాలపై చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. ఇవాళ 20 నుంచి 30 పెండింగ్ స్థానాల నేతలతో చంద్రబాబు నాయుడు, సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. సున్నిత‌మైన ఆ స్థాన‌ల‌పై లోతుగా చ‌ర్చించి, అభ్య‌ర్థుల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యం తీసుకోబోతున్నారు చంద్ర‌బాబు.

మేనిఫెస్టో కమిటీ భేటీ..! చంద్రబాబుతో ఏకాంతంగా స‌మావేశ‌మైన గంటా..!!

మేనిఫెస్టో కమిటీ భేటీ..! చంద్రబాబుతో ఏకాంతంగా స‌మావేశ‌మైన గంటా..!!

చిత్తూరు జిల్లా సత్యవేడు, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబాలపల్లి నేతలతో తొలుత సమావేశమవుతారు. సొంత జిల్లా కావడంతో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి ఆదిత్య ఉండగా, జేడీ రాజశేఖర్, పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. సుజనా, యనమల నేతృత్వంలోని కమిటీ సత్యవేడు నేతల అభిప్రాయం తెలుసుకోనున్నారు. శ్రీకాళహస్తి టికెట్‌ కోసం ఎస్‌సీవీ నాయుడు, బొజ్జల సుధీర్‌ పోటీపడుతున్నారు.

 సున్నిత‌మైన స్థానాల‌పై బాబు క‌స‌ర‌త్తు..! నేడు ఖ‌రారు కానున్న అభ్య‌ర్థులు..!!

సున్నిత‌మైన స్థానాల‌పై బాబు క‌స‌ర‌త్తు..! నేడు ఖ‌రారు కానున్న అభ్య‌ర్థులు..!!

మదనపల్లి లేదా తంబాలపల్లిలో ఒకటి బీసీకి ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. కృష్ణా జిల్లా కైకలూరు, నూజివీడు, తిరువూరుల స్థానాలపైనా స్పష్టత రానున్నది. తిరువూరుకు ఇన్‌ఛార్జిగా స్వామిదాస్ ఉండగా, మంత్రి జవహర్ పేరు ప్రచారం జరుగుతోంది. కైకలూరు టికెట్‌ను జె.వెంకట రమణ, దోనెపూడి పవన్ ఆశిస్తున్నారు. బాపట్ల అసెంబ్లీ పంచాయతీ పైనా నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నియోజవర్గానికి ఇన్‌ఛార్జిగా అన్నం సతీష్ ఉన్నారు. ఈ టికెట్ తన కుమారుడుకి ఇవ్వాలని సీనియర్ నాయకుడు గాదె వెంకట్ రెడ్డి పట్టుబడుతున్నారు.

 రెబ‌ల్స్ బెడ‌ద లేకుండా చ‌ర్య‌లు..! రంగంలోకి దిగిన సీనియ‌ర్లు..!!

రెబ‌ల్స్ బెడ‌ద లేకుండా చ‌ర్య‌లు..! రంగంలోకి దిగిన సీనియ‌ర్లు..!!

ఉండవల్లి ప్రజావేదికలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన టీడీపీ మ్యానిఫెస్టో కమీటీ సమావేశమైంది. మంత్రులు నక్కా ఆనందబాబు, కాలువ శ్రీనివాసులు, మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్ శోభా స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి.అనురాధ మాజీ మంత్రి పుష్పరాజ్, కృష్ణయ్య, కుటుంబరావు హాజరయ్యారు.

 ప‌క‌డ్బందీగా మేనిఫెస్టో..! ప్రాధాన్య‌తాంశాలకు చోటు..!!

ప‌క‌డ్బందీగా మేనిఫెస్టో..! ప్రాధాన్య‌తాంశాలకు చోటు..!!

మేనిఫెస్టో లో ఏ అంశాలు పొందుపర్చాలి, ప్రాధాన్యత అంశాలు ఏమిటీ అనేదానిపై చర్చించనున్నారు. నామినేషన్లకు స్వల్ప గడువు ఉండడం మూలంగా మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చి పార్టీ అధినేత చంద్రబాబుకు అందచేసే అవకాశముంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో నారా చంద్రబాబు నాయుడు ను మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల ఖరారుపై చర్చంచుకున్నారు.

English summary
TDP president Chandrababu Naidu has focused on pending positions. Chandrababu Naidu discussing pending positions with senior leaders. Today, Chandrababu Naidu and Coordination Committee members meet with leaders from 20 to 30 pending positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X