అమ్మాయిపై రేప్ కేసు: బెజవాడలో ముగ్గురు అరెస్టు

నిందితులపై లైంగిక నేరాలు - బాలల సంరక్షణ, నిర్భయ చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజుల క్రితం సికింద్రాబాద్‌కు చెందిన బాలిక తనను తల్లి మందలించడం ఇంటి నుంచి పారిపోయింది. ఆమె విజయవాడకు చేరుకుంది. దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్తుండగా మల్లేశ్వరాలయ మార్గంలోని దుకాణంలో పనిచేసే గాది మాధవరావు ఆమెను దగ్గరకు తీశాడు.
అతను ఆ అమ్మాయిని తెలిసినవారి ఇంట్లో ఉంచి లోబర్చుకున్నాడు. ఇంద్ర కీలాద్రీపై పరిచయమైన మరో యువకుడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోరుపల్లి నాగమహేష్ ఆమెను విశాఖపట్నం తీసుకుని వెళ్లాడు. అతను కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో మనస్తాపానికి గురై తిరిగి విజయవాడకు చేరుకుంది.
మొదట పరిచయమైన మాధవరావుకు తెలిసినవారి ఇంట్లోనే ఉంది. దీన్ని గమనించిన మరో యువకుడు కుప్పల సుబ్రమణ్యం ఎవరూ లేని సమయంలో బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. వారు ముగ్గురు కూడా అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications