ప్రాణం తీసిన గాలిపటం: విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారుల మృతి

కృష్ణా: జిల్లాలోని పామర్రు మండలం పరిధిలోని రాజు హరిగోపాల్‌నగర్‌లో శుక్రవారం దారుణం జరిగింది. విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని ఇనుప రాడ్‌తో తీయబోయిన ముగ్గురు చిన్నారులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

ఈ ప్రమాదంలో నల్లబోతుల వెంకటేశం, వెంకటేశ్వరమ్మ దంపతుల ఇద్దరు కుమారులు ఏసురాజు(11), జాన్ బాబు(9), బోగిన వీరయ్య, తిరుపతమ్మ దంపతుల కుమారుడు సురేష్(12) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.

వెంకటేశం దంపతులకు ఉన్న ఇద్దరు పిల్లలు, వీరయ్య దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చిన్నారుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Three children electrocuted while flying kite in Andhra Pradesh

అతిగా మద్యం సేవించి యువకుడు మృతి

హైదరాబాద్: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం....కందిగూడకు చెందిన డ్రైవర్ పరిశుద్ద(27) కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అతిగా మద్యం తాగి కిందపడిపోయాడు.

వెంటనే స్థానికులు అతడ్ని 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను గురువారం ఉదయం తెల్లవారుజూమున చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీల ముఠా అరెస్టు

హైదరాబాద్: చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను లంగర్‌హౌజ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+