ఏపీలో మూడురోజులు వర్షాలు, ఐఎండీ అలెర్ట్.. ఏ జిల్లాలలో అంటే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి మూడు వారాలు గడుస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు మాత్రం కురవలేదు. ఇప్పటికే వర్షాలు అనుకున్న దానికంటే ఎక్కువగా నమోదు అవుతాయని భావించినప్పటికీ చాలా ప్రాంతాలలో వర్షపాతం తక్కువగా నమోదయింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వర్షపాతం తక్కువగా నమోదయింది.

ఏపీలో వర్షాలు
అయితే తాజాగా రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు యానంలో కూడా రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Three days rains in AP in these districts IMD alert

ఈ జిల్లాలలో తేలికపాటి వర్షాలు
రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తమ అధికారిక ఖాతా ద్వారా వెల్లడించింది.

ఉత్తర, దక్షిణ కోస్తాలలో వాతావరణం ఇలా
ఉత్తర కోస్తా, యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈరోజు రేపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు
దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కూడా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాయలసీమలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నైరుతి రుతుపవనాలు బలపడుతున్న క్రమంలో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో వర్షాలు పడతాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+