మద్యం మత్తులో జనాలపైకి కారు: ముగ్గురు మృతి

తిరుపతి నుంచి తమిళనాడుకు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ మద్యం మత్తులో పిచ్చాటూరు సమీపంలో రామగిరి వద్ద రోడ్డుపై వెడుతున్న నలుగురు పాదచారులపైకి వాహనాన్ని నడిపించాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు వృద్దులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అక్కడితో ఆగకుండా రోడ్డు పక్కనే ఉన్న ఓ బార్బర్‌షాపును ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారు ధ్వంసమైనా కారు డ్రైవర్ మాత్రం ఎవరికి చిక్కకుండా తప్పించుకుని పారిపోయాడు. ఈ ప్రమాదంలో రామగిరికి చెందిన ఎం సుబ్రహ్మణ్యం (70), చట్టిగాన్ (66) కాలంజేరికి చెందిన గోవిందస్వామి (60) అక్కడి కక్కడే మృతి చెందారు.
రామగిరికి చెందిన పార్థీపన్ (57) తీవ్రంగా గాయపడ్డారు. ఇతనిని 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను శవపరీక్ష నిమిత్తం సత్యవేడు మార్చులోని మార్చురీకి తరలించారు. పిచ్చాటూరు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.












Click it and Unblock the Notifications