ప్రియుడితో కలిసి బిడ్డను తల్లి వ్యభిచార గృహాలకు అమ్మేసింది

ఒంగోలు: తన కూతురు పట్ల ఓ తల్లి అత్యంత అమానుషంగా వ్యవహరించిన తీరు వెలుగులోకి వచ్చింది.ట తన ప్రియుడితో కలిసి ఓ మహిళ తన 11 ఏళ్ల కూతురిని వ్యభిచార కేంద్రానికి అమ్మేసింది. మూడు నెలల కాలంలో కూతురిని రెండు వ్యభిచార కేంద్రాలకు అమ్మేసింది.

ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన బాలిక విక్రయ కేసులో పోలీసులు శుక్రవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో బాలిక తల్లితోపాటు అయిదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురు అరెస్టయ్యారు. తల్లి దగ్గర నుంచి బాలికను కొనుక్కున్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన లంకా అనుషా అలియాస్‌ మధుమిత, ఆమె నుంచి కొనుగోలు చేసిన చెల్లాపల్లికి చెందిన అన్నపురెడ్డి నాగమణితోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చీరాల విఠల్‌నగర్‌కు చెందిన బడుగు కరుణాకర్‌ అలియాస్‌ నానిని పోలీసులు అరెస్టు చేశారు.

డిఎస్పీ డాక్టర్ జి. ప్రేమ్ కాజల్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సికింద్రాబాదు షామీర్‌పేట బాలాజీనగర్‌కు చెందిన వేల్పుల విల్సన్‌తో గజ్జల దీపిక అలియాస్ పూజ తన భర్త రాజును వదిలేసి సహజీవనం చేస్తోంది. పూజ కూతురిపై తండ్రి వరుసైన విల్సన్ పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

 Three more arrested in the sale of girl

ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే తల్లి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించింది. కొద్ది రోజుల తర్వాత పూజ, విల్సన్ కలిసి విజయవాడలోని ఓ మహిళకు కూతురుని అమ్మేశారు. రెండు నెలల తర్వాత విజయవాడకు చెందిన మహిళ మంగళగిరిలో వ్యభిచారం నిర్వహించే మరో మహిళకు బాలికను అమ్మేసింది. మంగళగిరికి చెందిన మహిళ చీరాల జాండ్రపేట గుమాస్తాల కాలీనీ బోడిపాలెంలో వ్యభిచారం నిర్వహించే అన్నపురెడ్డి సాంబ అలియాస్ ప్రేమవాణికి ఆ బాలికను అమ్మేసింది.

బోడిపాలెంలో వ్యభిచారం కేంద్రం నిర్వహించే ప్రేమవాణి ప్రియుడు జయశంకర్ నగర్‌కు చెందిన పారాబత్తిన జతిన్‌లాల్ కూడా పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరుచూ ప్రేమవాణి వద్దకు వెళ్లే హోంగార్డు షేక్ అజీజ్ బాషా కూడా ఆ బాలికతో కామవాంఛను తీర్చుకున్నాడు.

ప్రేమవాణి, పారాబత్తిన జతిన్‌లాల్, అజీజ్ బాషా, బాలిక తల్లి గజ్జల దీపిక, ఆమె ప్రియుడు వేల్పుల విల్సన్‌లను వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు అరెస్టు చేశారు. బాలిక విక్రయం కేసును తొలుత మాములుగానే తీసుకున్న పోలీసులు బాలికను విచారణ చేయటంతో దిగ్భాంతి కలిగించే విషాయలు బయటపడ్డాయి. డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌ బాలికతో మాట్లాడారు.

బాలికను హైదరాబాద్‌లో ఒకరికి విక్రయించగా, అక్కడినుంచి చీరాలకు ఏవిధంగా వచ్చింది, ఎవరెవరు లైంగిక దాడికి పాల్పడింది అన్ని విషయాలు పూస గుచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న చీరాల డీఎస్పీ ప్రేమ్‌ కాజల్‌ ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. మూడు బృందాలను ఏర్పాటుచేసి వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో ప్రమేయమున్న అందరిని అరెస్టు చేయటంతోపాటు బలమైన సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+